బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో రెండో వారం మొదలైంది. వైల్డ్ కార్డుతో మొదలైన ఎపిసోడ్… నామినేషన్ ప్రక్రియతో ముగిసింది. అభిజీత్ – మోనాల్ – అఖిల్ ట్రయాంగిల్ స్టోరీ, నామినేషన్ ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి.
* ఈ రోజు ఎపిసోడ్ మోనాల్ – అఖిల్‌తో మొదలైంది. ఇద్దరూ వంట గదిలో రోటీ చేస్తూ కనిపించారు. అఖిల్ చేసిన రౌండ్ రౌండ్ రోటీలు చేసి మోనాల్ తెగ మురిసిపోయింది. అఖిల్‌తో రెస్టరెంట్ పెట్టిద్దామంటూ జోక్ కూడా వేసింది.
* మోనాల్‌తో మాట్లాడదామని అభిజీత్ ప్రయత్నించాడు. అయితే మోనాల్ ఆసక్తి చూపించలేదు. ‘నువ్వు నన్ను నమ్ముతున్నావా?’ అని అభిజీత్ అడిగితే… మోనాల్ అవునంటూ తలూపింది. అయితే ‘నేను మాట్లాడాలి అని చూస్తే… నువ్వు మాట్లాడలేదు’ అని మోనాల్ అభిజీత్‌తో అంది. సమయం లేకపోవడం వల్ల మాట్లాడలేదు అంటూ మోనాల్ అక్కణ్నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు మాట్లాడదామన్నా వినలేదు.
* తెల్లవారుజామున 4 గంటలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కుమార్ సాయి ఇంట్లోకి నక్కి నక్కి వచ్చాడు. స్టోర్ రూమ్ నుంచి లోపలకి వచ్చి దుప్పటేసుకొని నిద్రపోయాడు. ఉదయాన్నే నిద్ర లేచిన దేవీని ఆటపట్టిద్దామనుకున్నాడు. ‘దుప్పటి లాగితే నామినేట్ అవుతారని భయపెట్టాడు’ కూడా. అయితే ఇంతలో దివి వచ్చి దుప్పటిలాగేసి కుమార్‌సాయిని బయటపెట్టేసింది. అందరినీ ఆటపట్టిదామనుకున్న కుమార్ సాయి ఆలోచన ఫ్లాప్ అయ్యింది.
* ఉదయాన్నే బిగ్‌బాస్ వేసిన ‘కాటుకెట్టిన కళ్లను చూస్తే…’ పాటకు అందరూ స్టెప్పులేసి చీర్‌అప్ అయ్యారు. నిన్న అఖిల్ ఒక్కడే డ్యాన్స్ వేయగా, ఈ రోజు అఖిల్‌తో మోనాల్ జత కట్టింది. ఇది చూస్తుంటే సమ్‌థింగ్ కుకింగ్ అనిపిస్తోంది.
* ఆ తర్వాత తమ మధ్య ఉన్న మిస్ అండర్‌స్టాండింగ్స్‌ను క్లియర్ చేసుకోవడానికి అభిజీత్, మోనాల్ కలసి కూర్చొని మాట్లాడుకున్నారు. అయితే మధ్యలో దివి టాపిక్ వచ్చి చర్చ ఎటో వెళ్లిపోయింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే మన మధ్య అభిప్రాయభేదాలు వస్తున్నాయని అభిజీత్ చెప్పాడు. అనవసరంగా ఏడవకుండా… అవసరమైనప్పుడే కన్నీళ్లు కార్చు అని మోనాల్‌కు సజెస్ట్ చేశాడు అభిజీత్.
* పడవలో కూర్చున్నప్పడు నోయల్ ఓ ర్యాప్ పాడి అలరించాడు. ‘పడవెళ్లిపోతోందిరా… ’ అంటూ ఇంట్లో ఉన్నవాళ్లందరి పేర్లతో ఆ పాటను పూరించి పాడాడు. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ కూడా ఓ సరదా పాట వేసుకున్నాడు.
* ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సూర్యకిరణ్‌ను అమ్మ రాజశేఖర్ గుర్తు చేసుకున్నాడు. రోజూ ఇద్దరూ కూర్చొని సిగరేట్ తాగే చోటుకు వెళ్లి తనలో తాను మాట్లాడుకున్నాడు. సూర్యకిరణ్‌ను కూర్చున్న ప్లేస్ దగ్గర సూర్య… మై ఫ్రెండ్ అని వేలితో రాశాడు. సో క్యూట్ కదా.
* బిగ్‌బాస్‌లో ట్రయాంగిల్ స్టోరీ రన్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు మోనాల్‌తో అభిజీత్ మాట్లాడాలి అనుకుంటుండగా, మరోవైపు అఖిల్ కూడా మాట్లాడాలి అనుకుంటున్నాడు. ఇద్దరూ కలసి కూర్చుని మాట్లాకున్నారు. ‘నీతో మాట్లాడాలి అని పిలిస్తే నువ్వు ఉండలేదు’ అంటూ మోనాల్‌తో అఖిల్ అన్నాడు. ఈ క్రమంలో మోనాల్ కళ్లలో నీళ్లు తిరిగాయి. అయితే ఇది ఏడుపు కాదు… కోపం అని చెప్పినా.. ఆమె కళ్లలో నీళ్లు ఆగలేదు. ఆఖరికి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. అక్కడికి కాసేపటి తర్వాత అఖిల్ అటు ఇటు చూసి… మోనాల్ కూర్చున్న మీటింగ్ ఏరియాకు వెళ్లాడు. అయితే అక్కడికి సోహైల్ రావడంతో అఖిల్ లేచి వెళ్లిపోయాడు.
* ‘నేను నెగ్లక్ట్ చేస్తే.. అభిజిత్‌తో మాట్లాడుతుందేమో’ అని మోనాల్‌ను దూరం పెడుతున్నా… అని లాస్యతో అఖిల్ చెప్పాడు. అయితే నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు.. నువ్వు దూరం పెడితే అటు వెళ్తుందేమో అని అనుకోవద్దు అని లాస్య చెప్పింది.
* నోయల్‌తో పూల్ దగ్గర ముచ్చట్లు పెడుతున్న మోనాల్‌ను పిలిచి అఖిల్ మాట్లాడాడు. ‘నువ్వు ఎవరికీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వక్కర్లేదు’ అంటూ సజెషన్ ఇచ్చాడు. ‘నేను నోయల్‌తో నా కుక్క గురించి మాట్లాడుతున్నా’ అని చెప్పింది మోనాల్. దానికి అఖిల్‌కు కోపం వచ్చి… కాస్త గొంతు పెంచాడు. ఇది మోనాల్‌కు నచ్చలేదు. ఎందుకు అరుస్తున్నవా అని అడిగింది. ‘నువ్వు అరిచినప్పుడు నేను విన్నా కదా’అని అఖిల్ చెప్పాడు. నా మాటల్లో నీకు ప్రేమ కనిపించడం లేదా అని కూడా అడిగేశాడు. అయితే నువ్వంటే నాకిష్టం, టైమ్ స్పెండ్ చేయడమంటే నాకిష్టం అని మోనాల్ తేల్చేసింది. నేనేమీ తినలేదు… నీరసంగా ఉందని మోనాల్ చెబితే… తిను ఎవరొద్దన్నారు అంటూ హార్స్‌గా మాట్లాడాడు అఖిల్. నాకు ఆకలేస్తే నేను పెట్టుకు తిన్నాను కదా అని అఖిల్ కోపంగా అన్నాడు. ముందుగా అనుకున్నట్లే ఏదో జరుగుతోంది.
* హౌస్ మేట్స్ కోసం రేషన్ ఇవ్వడానికి బిగ్ బాస్ కొత్తగా రేషన్ మేనేజర్‌ను నియమించాడు. ప్రతిసారి రేషన్ వచ్చినప్పుడు రేషన్ మేనేజర్‌కు 1000 లగ్జరీ బడ్జెట్ పాయింట్లు అదనంగా లభిస్తాయి. వాటితో ఆయనకు అవసరమైన సామాన్లు కొనుక్కోవచ్చు. రేషన్ మేనేజర్‌ను ఎంపిక చేసే బాధ్యత లాస్యకు అప్పగించారు. చర్చల తర్వాత ఆ పోస్టును అమ్మ రాజశేఖర్ మాస్టర్‌కు ఇచ్చారు.
* ఇక్కడ ఎవరినీ ఇంప్రెస్ చేసే అవసరం మనకు లేదు అని అఖిల్‌తో అభిజీత్ చెప్పాడు. దానికి అఖిల్ సపోర్టు చేశాడు. ఇంట్లో ప్రతి విషయానికీ మిస్ అండర్‌స్టాండింగ్ కారణమని ఇద్దరూ అనుకున్నారు. ఈ క్రమంలో మోనాల్ టాపిక్ వచ్చింది. అభిజీత్ చెబుతున్న విషయాన్ని అఖిల్ అన్యమనస్కంగా కనిపించింది.
* రెండో వారం నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్‌బాస్ పడవ టాస్క్ పెట్టాడు. పడవలో అందరినీ ఎక్కించి, ఒక్కో తీరం దగ్గర ఒకరిని దిగమన్నాడు. అలా దిగినవాడు నామినేట్ అయినట్లు అని చెప్పాడు. అలా తొమ్మిది తీరాల్లో తొమ్మిదిసార్లు పడవ ఆగుతుందని, ఆగి హారన్ కొట్టినప్పుడు పడవ దిగాలని సూచించాడు. అయితే టాస్క్ మధ్యలో దిగిపోయినవాళ్లు కూడా నామినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. అలా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి గంగవ్వ, నోయల్, మోనాల్, సోహైల్, కళ్యాణి, రాజశేఖర్, కుమార్, హారిక, అభిజీత్ నామినేట్ అయ్యారు. నామినేషన్ సాగిన విధానం ఇదీ…