బిగ్‌బాస్‌ 4: ‘బిబి గ్రాండ్ హోటల్‌’ గెలుపు ఎవరిదో తెలుసుగా?

కెప్టెన్సీ పోటీదారులను నిర్ణయించడానికి బిగ్‌బాస్‌ ‘బిబి గ్రాండ్‌ హోటల్‌’ అనే టాస్క్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండున్నర రోజులపాటు చూపించిన ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు ఎంతవరకు బిగ్‌బాస్‌ నియమాలు పాటించి ఆడారో మనం ఇప్పటికే చదువుకున్నాం. అంత చప్పగా ఈ సాగిన ఈ టాస్క్‌లో అతిథుల టీమ్‌ గెలిచింది. ఐదు స్టార్లను పొందడంలో విఫలమైన హోటల్‌ టీమ్‌ ఓడిపోయింది. ఇక సీక్రెట్ టాస్క్‌ చేసిన అవినాష్‌ గెలిచాడు.

అందరినీ లివింగ్‌ ఏరియాకు పిలిచి ‘హోటల్‌ టీమ్‌ దగ్గర ఎన్ని స్టార్స్‌ ఉన్నాయి’ అంటూ బిగ్‌బాస్‌ అడిగాడు. ముందుగా అందరూ అనుకున్నట్లే… అభిజీత్‌ ఐదు ఉన్నాయి అని చెప్పాడు. దీనికి అతిథుల టీమ్‌ అంగీకరించలేదు. దీంతో ‘అతిథుల టీమ్‌ ఇష్టప్రకారం ఎన్ని స్టార్స్‌ ఇచ్చారు’ అంటూ బిగ్‌బాస్‌ మరోసారి అడిగారు. అప్పటికీ అభిజీత్‌ తన మాటనే కొనసాగించాడు. ‘హారికను మేమేమీ ఫోర్స్‌ చేయలేదని, ఆమెనే ఐదు స్టార్స్‌ ఇచ్చిందని’ చెప్పాడు. అయితే బిగ్‌బాస్‌ అభిజీత్‌ మాటలను విశ్వసించలేదు. హోటల్‌ టీమ్‌ ఓడిపోయిందని చెప్పాడు.

ఆటలో గెలవడానికి ట్రిక్‌ చేశా అని అభిజీత్‌ ఒప్పుకున్నాడు. స్మార్ట్ గేమ్‌తో ‘ఉక్కుహృదయం’ టాస్క్‌ గెలిచిన అభిజీత్‌… ఇందులోనూ గెలిపిస్తాడని హోటల్ సభ్యులు అనుకున్నారు. కానీ ఈసారి అభిజీత్‌ పాచిక పారలేదు. కానీ స్మార్ట్‌ గేమ్‌ ఆడావని నాగార్జున వీకెండ్‌లో మెచ్చుకునే అవకాశం ఉంది. మరి కష్టపడి ఆడిన అతిథుల టీమ్‌కీ అభినందనలు వస్తాయేమో చూడాలి.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus