Bigg Boss 5 Telugu: చీఫ్ గెస్ట్ లతో చిందులు.. సుమ వేసిన పంచులు..! దీపావళి హైలెట్స్ ఇవే..!

బిగ్ బాస్ లో దీపావళి స్పెషల్ ఎపిసోడ్ తో మోత మోగబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. సాయంత్రం ఆరుగంటల నుంచే ఆదివారం షో స్టార్ట్ కాబోతోంది. సన్ డే ఫన్ డే అంటూ వచ్చే నాగార్జున ఈసారి హౌస్ మేట్స్ లో మంచి జోష్ ని నింపబోతున్నారు. ఇలాగే లాస్ట్ టైమ్ దసరాకి చీఫ్ గెస్ట్ లని తీస్కుని వచ్చి డ్యాన్స్ పెర్ఫామన్స్ చేయించారు. కొంతమందిని బిగ్ బాస్ టీమ్ తో కలిపించి ఇన్ పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది రికార్డ్ స్థాయిలో రేటింగ్ ని సాధించింది. అందుకే, ఇప్పుడు దీపావళి స్పెషల్ అంటూ మరోసారి బిగ్ బాస్ టీమ్ నాన్ స్టాప్ గా నాలుగు గంటల పాటు సందడి చేయబోతోంది.

దీపావళి ఎపిసోడ్ మోత మోగబోతోంది. దీపావళి హైలెట్స్ లో భాగంగా మనం చూసినట్లయితే, హీరోయిన్స్ తో నాగార్జున స్పెషల్ గా కనిపించబోతున్నాడు. నలుగురు యంగ్ హీరోయిన్స్ స్టేజ్ పైన డ్యాన్స్ పెర్ఫామన్స్ లతో ఆకట్టుకోబోతున్నారు. ఇందులో ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. దివి వైద్య, మోనాల్ గజ్జర్ కూడా ఉన్నారు. అంతేకాదు, సీజన్ 1లో పార్టిసిపేట్ చేసిన కల్పన స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతోంది. ఇక అవినాష్, బాబాభాస్కర్ మాస్టర్ ఇలా కొంతమంది హౌస్ మేట్స్ ని పలకరించేందుకు హౌస్ లోకి సైతం వెళ్లారు. దేవరకొండ బ్రదర్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతున్నారు.

అంతేకాదు, విజయ్ దేవరకొండతో బిగ్ బాస్ టీమ్ సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేసింది. ఇక లాస్ట్ ఇయర్ లాగానే యాంకర్ సుమ వేసిన పంచ్ లు హైలెట్ గా నిలవబోతున్నాయి. లాస్ట్ టైమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ సుమ హౌస్ మేట్స్ ని ఒక రేంజ్ లో ఆడుకుంది. వారి మానరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తూ పంచ్ లు వేసింది. ఇప్పుడు కూడా హౌస్ మేట్స్ కి ఫుల్ క్లాస్ పీకుతూ పంచులు వేసిన సుమ నాన్ స్టాప్ ఫన్ చేసినట్లుగా తెలుస్తోంది.హీరో మరోవైపు హీరోయిన్ శ్రీయా స్పెషల్ పెర్ఫామన్స్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పై మోత మోగబోతోందట. ఒకవైపు క్రికెట్ వరల్డ్ కప్ ఇండియా న్యూజిలాండ్ కీలకమైన మ్యాచ్., మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5లో స్పెషల్ ఎపిసోడ్ మరి ఈ సందడి చూడాలంటే సాయంత్రం ఆరుగంటల వరకూ ఆగాల్సిందే.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus