Bigg Boss 5 Telugu: సస్పెన్స్ రివీల్ చేసిన బిగ్ బాస్ టీమ్!

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. విదేశాల నుండి ఇండియాకి వచ్చిన ఈ కాన్సెప్ట్ ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. హిందీలో ఈ షో మొదలై దశాబ్దంన్నర దాటేసింది. సీజన్ సీజన్ కి షోకి ఆదరణ మరింత పెరిగిపోతుంది. తెలుగులో కూడా ఈ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా ఐదో సీజన్ మొదలుకావడానికి చాలా ఆలస్యమైంది. అసలు షో ఉంటుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.

ఆ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమోను విడుదల చేశారు. తాజాగా ఈ షోను సెప్టెంబర్ 5 నుండి మొదలుపెట్టబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు షో మొదలుకానుంది. కంటెస్టెంట్లు ఎవరనే విషయంలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. యాంకర్ రవి, సురేఖా వాణి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ ఇలా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీరిలో ఎంతమంది హౌస్ లో కనిపిస్తారో చూడాలి.

ఇక ఈసారి బిగ్ బాస్ షోను ఓటీటీలో కూడా ప్రసారం చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. గత సీజన్లతో పోలిస్తే ఈసారి మరింత స్పెషల్ గా షోని డిజైన్ చేయబోతున్నారు. మూడు, నాలుగు సీజన్లను హోస్ట్ చేసిన నాగార్జున ఐదో సీజన్ ను కూడా హోస్ట్ చేస్తున్నారు.

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus