Bigg Boss 7 Telugu: ఈసారి ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ? మనీతో పాటుగా ఇంకా ఎన్ని గిఫ్ట్స్ అంటే.,

బిగ్ బాస్ తెలుగు సీజన్ – 7 ఉల్టా పుల్టా విన్నర్ కి డబ్బే డబ్బు రాబోతోంది. ఈసారి సీజన్ లో ప్రైజ్ మనీతో పాటుగా ఇంకా చాలా బహుమతులు కూడా ఇచ్చేందుకు ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీమ్. 50 లక్షలు ప్రైజ్ మనీతో పాటుగా జాస్ అలూకాస్ వారు అందించే 15లక్షల డైమండ్ నక్లెస్ రాబోతోంది. దీంతో పాటుగా 10 లక్షల బ్రీజా కార్ కూడా గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు. ఈవిషయాన్ని ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున స్టేజ్ పైన ఎనౌన్స్ చేశారు.

అంతేకాదు, ఈసారి ముగ్గురు ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు సూట్ కేస్ లో డబ్బు వస్తుందో రాదో అనేది కూడా సందేహంగానే ఉంది. ఎందుకంటే, సీజన్ మొదట్లో సూట్ కేస్ పంపించారు. ఫస్ట్ డే నే సూట్ కేస్ గేమ్ ఆడించారు. మరి ఇప్పుడు ఫినాలే ఎలా డిజైన్ చేయబోతున్నారు అనేది కూడా ఆసక్తికరం. అయితే, ఈ టైటిల్ గెలిచే అవకాశాలు ఎవరెవరికి ఉన్నాయంటే., బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఓటింగ్ పరంగా చూస్తే పల్లవి ప్రశాంత్ కి హ్యూజ్ గా జరుగుతోంది.

ఫస్ట్ వీక్ నుంచీ కూడా సేఫ్ అవుతూ వస్తున్నాడు. అలాగే శివాజీ సపోర్ట్ తో పల్లవి ప్రశాంత్ హౌస్ లో ఎలాంటి గొడవలకి వాగ్వివాదాలకి పోలేదు. కేవలం టాస్క్ లు ఆడటం, తన పని తాను చేస్కోవడం , నామినేషన్స్ అప్పుడు రెచ్చిపోయి మాట్లాడటం తప్పించి ఎలాంటి ఆటని చూపించలేదు. అయితే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మాత్రమే టైటిల్ రేస్ లో కనిపిస్తున్నాడు. శివాజీ కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అమర్ దీప్ మూడో స్థానంలో ఉన్నాడు. మరి ఈ ముగ్గురులోనే టైటిల్ విన్నర్ అనేది డిసైట్ అయ్యేలాగా కనిపిస్తోంది.

మరోవైపు అర్జున్ ఆడిన గేమ్ కూడా తనకి ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచేలా కనిపిస్తోంది. ఒకవేళ శోభా శెట్టి త్వరగా ఎలిమినేట్ అయిపోయినా, ప్రియాంక ఎలిమినేట్ అయిపోయినా వాళ్ల ఓట్లు అమర్ దీప్ కి పడే అవకాశం ఉంది. అంతేకాదు, బయట వాళ్లు క్యాంపైన్ చేసినా అమర్ దీప్ కి కూడా టైటిల్ రేస్ లో వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈసారి టైటిల్ విన్నర్ కి మాత్రం పండగనే చెప్పాలి. ఎందుకంటే, 50లక్షలు ఈసారి విన్నర్ కే ఇవ్వాలని (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ టీమ్ డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. అదీ మేటర్.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus