BIGG BOSS 9: ‘ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావ్’.. మామూలు ‘అగ్నిపరీక్ష’ కాదే..!
- August 12, 2025 / 12:50 PM ISTByPhani Kumar
‘బిగ్ బాస్’ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హౌస్ లో ఉన్న జనాలతో బిగ్ బాస్ ఆడించే గేమ్స్, వారికి ఇచ్చే టాస్కులు, వారి మధ్య పెట్టే ఫిటింగులు, తర్వాత వారి ఫైటింగులు.. వంటి వాటిని ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. ఇప్పటికి 8 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిశాయి. త్వరలో 9వ సీజన్ కూడా మొదలు కాబోతుంది. ఈ సీజన్ ను కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. కొత్త సీజన్ కు సంబంధించిన ప్రోమో కూడా కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయ్యింది. ‘ఈసారి చదరంగం కాదు.. రణరంగమే’ అంటూ హోస్ట్ నాగార్జున చెప్పడంతో ‘ఈ సీజన్ ఎలా ఉండబోతుంది?’ అనే విషయంపై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.
BIGG BOSS 9
ఇక ఇందులో భాగంగా.. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ కావాలనుకుంటే వీడియో చేసి పంపమని ‘బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష’ పేరుతో ఓ కాంటెస్ట్ రన్ చేసింది బిగ్ బాస్ యూనిట్. ఇందులో షార్ట్ లిస్ట్ అయిన 100 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లతో ‘అగ్ని పరీక్ష’ ప్రాసెస్ ను మొదలుపెట్టారు.

ఈ ‘అగ్ని పరీక్ష’ కార్యక్రమాన్ని శ్రీముఖి హోస్ట్ చేస్తుండగా అభిజిత్, నవదీప్, బిందుమాధవి..లు జడ్జీలుగా వ్యవహరించారు. ఈ అగ్నిపరీక్షకి సంబంధించిన చిన్న వీడియో లీక్ అయ్యింది. ఆగస్టు 09 నుండి ఆగస్టు 19 వరకు దీని షూటింగ్ జరుగుతుంది. ఆగస్టు 22 నుండి జియో హాట్ స్టార్‌లో ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేస్తారు. మొత్తం 13 ఎపిసోడ్‌లు ఉంటాయట.ఇక లీక్ అయిన ఎపిసోడ్ లో బిందు మాధవి ఓ కంటెస్టెంట్ పై ‘ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావ్’ అంటూ మండిపడుతుంది. ఆ పక్కనే ఉన్న నవదీప్ ‘హే పో’ అంటూ ఫైర్ అయ్యి లేచి వెళ్ళిపోతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Leaked Video from the sets of Telugu Big Boss Agnipariksha #Bigboss #Agnipariksha pic.twitter.com/l6cIPny3K0
— Telugu Cineverse (@TeluguCineverse) August 12, 2025
ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి
















