Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి
- August 12, 2025 / 11:49 AM ISTByPhani Kumar
‘ప్రభాస్ పెళ్ళి’… ఈ టాపిక్ పుష్కర కాలం నుండి సాగుతూనే ఉంది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా నుండి ‘పెళ్ళెప్పుడు?’ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ గోల చేస్తూనే ఉన్నారు.అందుకు ప్రభాస్ ఏదో ఒకటి చెప్పి.. సర్దిచెబుతూ వస్తున్నాడు. అయితే ‘బాహుబలి'(సిరీస్) కంప్లీట్ అయిన వెంటనే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని.. అతని పెదనాన్న, దివంగత స్టార్ హీరో కృష్ణంరాజు అప్డేట్లు ఇస్తూ వచ్చేవారు.’బాహుబలి’ రిలీజ్ అయినా ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు.
Shyamala Devi on Prabhas marriage
ఆ తర్వాత ‘సాహో’ కంప్లీట్ అయ్యాక ప్రభాస్ పెళ్లి ఉంటుందన్నారు. తర్వాత కోవిడ్ తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని కృష్ణంరాజు చెబుతూ వచ్చారు. ఆ తర్వాత ఆయన కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి ‘ప్రభాస్ పెళ్లి గురించి ప్రభాస్ నే అడగండి’ అంటూ మాట దాటేస్తూ వచ్చారు. ‘రాధే శ్యామ్’ తర్వాత అంటే 2022 చివర్లో ఆయన కాలం చేయడం కూడా జరిగింది. అప్పటి నుండి ప్రభాస్ పెళ్లి గురించి అప్డేట్లు ఇవ్వాల్సిన బాధ్యత కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ అయిన శ్యామల దేవిపై పడింది.

కొన్నాళ్లుగా శ్యామలా దేవి గారు ఎక్కడ కనిపించినా ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన తెస్తూ ఆమెను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు మీడియా వారు. తాజాగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటే.. ‘కచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు. ఈ సంవత్సరం అని చెప్పలేను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. శివయ్య ఎప్పుడనుకుంటే అప్పుడు ప్రభాస్ పెళ్లి ఉంటుంది’ అంటూ ఆమె సేఫ్ ఆన్సర్ ఇచ్చి మాట దాటేశారు. వాస్తవానికి ప్రభాస్ కి త్వరగా పెళ్లి అవ్వాలని ఎక్కువగా కోరుకునేది ఆమెనే. ఈ విషయంలో ఆమె ప్రభాస్ పై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. మరోపక్క ఆమె మీడియా ముందుకు వస్తే.. మీడియా ఒత్తిడి చేస్తూనే ఉంది. ఇది నెవర్ ఎండింగ్ టాపిక్ అయిపోయింది. ‘కన్నప్ప’ లాంటి కొన్ని సినిమాల్లో ప్రభాస్ పెళ్లి గురించి జోకులు కూడా వేసుకునే స్థాయికి వెళ్ళింది వ్యవహారం.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















