బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి మరింత రసవత్తరంగా సాగుతోంది. అలాగే ఈ సీజన్ ముందుగా ఊహించినట్టు లేదు. గత సీజన్లలో ఆడియన్స్ ముందుగా అంచనా వేసేవి జరిగేవి. కానీ ఈ సీజన్లో ఎవరైతే స్ట్రాంగ్ అనుకుంటామో.. వాళ్ళే వీక్ అయ్యి ఎలిమినేట్ అయిపోతున్నారు. ఎలిమినేషన్ల విషయంలో ఇన్ని ట్విస్టులు ఉంటాయని ఎవ్వరూ ఊహించలేదు. గత వారం ఎవ్వరూ ఊహించని విధంగా శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయ్యింది.
అంతకు ముందు మాస్క్ మెన్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. కాన్ఫిడెంట్ గా గేమ్ ఆడే వాళ్ళే ఎలిమినేట్ అవుతుండటం అందరికీ షాకిచ్చే అంశం. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే వాళ్ళకి నామినేషన్స్ పవర్ ఇవ్వడం వల్ల గేమ్ అంతా మారిపోతుంది అనుకోవాలి. ఇలాంటి షాకులు ఇంకా ఎన్నో చూడాలో అనుకుంటున్నా వేళ ఇప్పుడు మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు.
అతను మరెవరో కాదు భరణి. ఈ వారం నామినేషన్లలో మొత్తం 6 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళే తనూజ పుట్టస్వామి, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, దివ్య నిఖిత, భరణి శంకర్, రాము రాథోడ్. వీరిలో తనూజకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. తర్వాతి ప్లేస్ లో సుమన్ శెట్టి ఉన్నాడు. పవన్, నికిత కూడా సేఫ్ అయ్యారు. ఎటొచ్చి భరణికి తక్కువ ఓట్లు పడటంతో అతను ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.
వాస్తవానికి భరణి మొదటి నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించాడు. అతను డిఫెండ్ చేసుకునే విధానం కూడా అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ఏమైందో ఏమో అతను డౌన్ అయ్యాడు. ఈసారి నామినేషన్స్ లో టార్గెట్ అయిపోయాడు అని స్పష్టమవుతుంది.