బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు అవకాశాలు రావు అని ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. అయితే కొంతమంది అది రాంగ్ అని కూడా ప్రూవ్ చేశారు. హరితేజ, ఆదర్ష్ వంటి నటులు వరుసగా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు సీజన్ల కంటెస్టెంట్ లను పక్కన పెట్టేస్తే.. ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కానీ వారికి అవకాశాలు పెద్దగా రాలేదు. అయితే ‘బిగ్ బాస్ 4’ కంటెస్టెంట్ లకు మాత్రం అవకాశాలు వస్తున్నాయి.
సోహెల్, అఖిల్ వంటి కంటెస్టెంట్లు హీరోలుగా కూడా నటించేస్తున్నారు. మరి ‘బిగ్ బాస్3 కంటెస్టెంట్ లకు ఎందుకు అవకాశాలు రాలేదు అనేది అర్థం కాని ప్రశ్న. దీనికి తాజాగా ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ అలీ రెజా క్లారిటీ ఇచ్చాడు. అతను మాట్లాడుతూ.. “షో కంప్లీట్ అయ్యి మేము బయటకు వచ్చాక అందరికీ మంచి క్రేజ్ వచ్చింది. అయితే ‘బిగ్ బాస్’ ఫినిష్ అయిన 4 నెలల్లోనే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ఏర్పడడంతో… మా క్రేజ్ అంతా వేస్ట్ అయిపోయింది.
బయటకు వెళ్లి ఏదైనా పని చేసుకోవాలంటే మాకు సాధ్యం కాలేదు. ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత వెంటనే బిగ్ బాస్ 4 వచ్చేసింది. అంతే జనాలు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు” అంటూ చెప్పుకొచ్చాడు అలీ. ‘బిగ్ బాస్3’ తరువాత ‘మెట్రో కథలు’ ‘వైల్డ్ డాగ్’ వంటి సినిమాల్లో కనిపించాడు అలీ.