Himaja: బిగ్ బాస్ ఫేమ్ పై రూమర్లు.. స్పందించిన బ్యూటీ!

బిగ్ బాస్ బ్యూటీ హిమజకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్స్టాగ్రామ్ లో తన భర్తను ఆమె అన్ ఫాలో చేసిందని.. త్వరలోనే విడాకులు ఇవ్వబోతుందంటూ రూమర్లు వచ్చాయి. అసలు హిమజకు పెళ్లైందనే విషయం కూడా ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అలాంటిది పెళ్లి, భర్తకు విడాకులు లాంటి వార్తలు రావడంతో నెటిజన్లు షాకయ్యారు. తాజాగా తన విడాకులపై సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలపై హిమజ స్పందించింది.

ఈ మధ్య యూట్యూబ్ లో పెళ్లిళ్లు చేస్తూ.. విడాకులు కూడా ఇప్పించేస్తున్నారని వెటకారంగా మాట్లాడింది. సాధారణంగా ఇలాంటి విషయాలు పట్టించుకోనని.. కానీ తన తల్లితండ్రులు సున్నితంగా ఉంటారని.. ఇలాంటి వదంతుల వలన వాళ్లు ఎక్కువ బాధపడతారని చెప్పింది. ఇలాంటి ఫేక్ వార్తలను ప్రచారం చేయొద్దని.. అలాగే తన పెళ్లి, విడాకులకు తనను కూడా పిలవాలని వ్యంగ్యంగా స్పందించింది. మూడు, నాలుగేళ్లలో తప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని.. ఒకవేళ చేసుకుంటే చాలా గ్రాండ్ గా అందరికి చెప్పి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

తనకు పెళ్లిళ్లు సెట్ కావని.. ప్రస్తుతం సింగిల్ గా, హ్యాపీగా ఉంటూ తన ఫ్యామిలీను బాగా చూసుకుంటున్నట్లు చెప్పింది. సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. గత కొన్ని రోజులుగా తన వీడియోలు యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయని.. దీంతో కొందరు కావాలనే తనపై కుట్ర పన్ని ఇలాంటి రూమర్లను స్ప్రెడ్ చేస్తున్నారని మండిపడింది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus