Surekha Vani, Supritha: ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ జెస్సీతో కలిసి పార్టీలో సందడి చేసిన సురేఖ వాణి, సుప్రీత..!

సురేఖ వాణి.. దాదాపు 100 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఈమె హవా తగ్గింది. అడపా దడపా సినిమాల్లో కనిపిస్తుంది కానీ అవి గుర్తుండిపోయే పాత్రలు అయితే కాదు. పైగా ఈమె పాత్రలకు డైలాగులు కూడా ఉండటం లేదు. ఏదో కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది అనుకోవాలి..! ఒకప్పుడు దుబాయ్ శీను, రెడీ వంటి చిత్రాల్లో ఈమె చేసిన కామెడీని ఇప్పటికీ జనాలు మర్చిపోలేరు.

ఇదిలా ఉండగా.. 2019 లో సురేఖ వాణి తన భర్త సాయి చరణ్ ను కోల్పోయాక మానసికంగా కృంగిపోయినట్టు స్పష్టమవుతుంది. ఇప్పుడు కూతురే తన సర్వస్వం అనుకుని బ్రతుకుతుంది. ఎలాగోలా తన కూతురి కెరీర్ ను సెట్ చేయాలి. తనకు బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి.. సోషల్ మీడియా అనే అస్త్రాన్ని వాడుకుంటుంది. నిత్యం సుప్రీత చిన్న చిన్న వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ తల్లీ కూతుర్లు కలిసి ఓ పార్టీకి వెళ్లారు. అది ఏ పార్టీ అన్నది క్లారిటీ లేదు కానీ ఇక్కడ ‘బిగ్ బాస్ 5’ కంటెస్టెంట్ మరియు మోడల్ అయిన జెస్సీని వీళ్ళు కలిశారు. అతన్ని హగ్ చేసుకుని, రొమాంటిక్ గా దిగిన ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూస్తుంటే.. సురేఖ, సుప్రీత ఇద్దరూ కూడా తల్లీ కూతుళ్ల లా కాకుండా అక్కా చెల్లెళ్లు గా కనిపిస్తున్నారు అని చెప్పాలి. వీళ్ళ డ్రెస్సింగ్ అలా ఉంది మరి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus