Bigg Boss Sunny: బుల్లెట్ తగిలి ప్రమాదానికి గురైన బాస్ సన్నీ..!

బుల్లితెర పై ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్న నటుడు విజే సన్నీ వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సన్నీ హీరోగా అన్ స్టాపబుల్ అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్ర ప్రోమోను డైరెక్టర్ స్పెషల్ గా షూట్ చేస్తున్నారు.

అయితే ఈ ప్రోమో షూటింగ్ లో సన్నీ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా సప్తగిరి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కి గన్ గురి పెడుతూ అన్ స్టాపబుల్ సినిమా రిలీజ్ ఎప్పుడు అంటూ అడుగుతారు. ఆ విషయం నాకేం తెలుసు తనని అడుగు అంటూ పృథ్విరాజ్ సన్నీ వైపు చూపిస్తారు. సన్నీని ఇదే ప్రశ్న అడిగిన సప్తగిరి పొరపాటు తన చేతిలో ఉన్న రివాల్వర్ పేలుతుంది.

ఇక ఈ గన్నులో డమ్మీ బుల్లెట్లు ఉన్నప్పటికీ సన్నీ దగ్గరగా తగలడంతో భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది ఈ క్రమంలోని చిత్ర బృందం తనని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే ఇది నిజంగా జరిగిందా లేక ప్రోమో హైలెట్ కోసమే ఇలా చేశారా అన్న విషయం మాత్రం తెలియడం లేదు. ఈ మధ్యకాలంలో సినిమాలను ప్రమోట్ చేయడం కోసం ఈ విధమైనటువంటి స్టంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ సినిమా ప్రమోషన్ కోసమే ఇలాంటి స్టంట్ చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు.

ఇక సన్నీ (Sunny) నటించిన ఏటీఎం సినిమా విడుదలకు ముందు కూడా ఈయన ఏటీఎంలో దొంగతనం చేసి పారిపోతున్నట్టు చూపించారు. అది కూడా సినిమా ప్రమోషన్ లో భాగమనీ తెలుస్తుంది. అయితే ప్రస్తుతం తనకు బుల్లెట్ తగలడం కూడా ప్రమోషన్లలో భాగమేనని పలువురు భావిస్తున్నారు. ఈ సినిమాలో వీజే సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. పోసాని, 30 ఇయర్స్ పృథ్వి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, బిత్తిరి సత్తి… ఇలా టాలీవుడ్ కమెడియన్ గ్యాంగ్ మొత్తం నటిస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus