Bigg Boss: అలసి పోయిన బిగ్ బాస్..! తీరు మార్చుకోని హౌస్ మేట్స్..!

బిగ్ బాస్ ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఒక్కొక్కరికి ఒక్కో సినిమా క్యారెక్టర్ ఇస్తూ ఎంటర్ టైన్ చేయమని ఆదేశించాడు. కానీ, హౌస్ మేట్స్ కాస్ట్యూమ్స్ పై పెట్టిన శ్రద్ధని కంటెంట్ పై పెట్టలేకపోయారు. దీంతో కోపం వచ్చిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి పనిష్మెంట్ ఇచ్చాడు. ఆసక్తి లేని వాళ్లు తక్షణమే మైయిన్ డోర్ నుంచీ ఇంటికి వెళ్లిపోవచ్చని ఆదేశించాడు. బిగ్ బాస్ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంత విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారని, టాస్క్ ల పట్ల అస్సలు శ్రద్ధచూపించడం లేదని సీరియస్ అయ్యాడు బిగ్ బాస్.

అందర్నీ గార్డెన్ ఏరియాలో నుంచోమని ఏకిపారేశాడు. అసలు ఏం జరిగిందంటే., బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ ఈవారం వచ్చిన ఎంటర్ టైన్మెంట్ టాస్క్ ఆడకుండా ముచ్చట్లు పెట్టుకున్నారు. కాసేపు గెటప్స్ లో టైమ్ పాస్ చేశారు. మిమిక్రీ చేస్తూ గెటప్స్ ని ఎంజాయ్ చేశారే తప్ప ఒక చిన్న స్కిట్ కూడా పూర్తి చేయలేకపోయారు. దీంతో బిగ్ బాస్ కి ఒళ్లు మండింది. అందర్నీ ఉద్దేశ్యించి వీరలెవల్లో క్లాస్ పీకారు.

ఇప్పటి వరకూ బిగ్ బాస్ చరిత్రలో ఈ టాస్క్ ఇచ్చిన ఏ సీజన్ లో కూడా ఇంత నిరాశాజనికంగా జరగలేదని, దానికి కారణం ఇంటి సభ్యుల నిర్లక్ష్యం అని చెప్పాడు. అలాగే, టాస్క్ ల పట్ల నిర్లక్ష్యం, బిగ్ బాస్ ఆదేశాల పట్ల నిర్లక్ష్యం. మీ నిర్లక్ష్యం బిగ్ బాస్ నే కాకుండా ఆడియన్స్ ని కూడా నిరాశ పర్చిందని చెప్పాడు. మైయిన్ డోర్స్ ఓపెన్ చేస్తూ, మీకు ఆట పట్ల ఆసక్తి లేకపోతే తక్షణమే బిగ్ బాస్ హౌస్ నుంచీ వెళ్లిపోమని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ షాక్ అయ్యారు.

అంతేకాదు, వాళ్లు వేసుకున్న కాస్య్టూమ్స్ ని కూడా స్టోర్ రూమ్ లో పెట్టమని ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ బిగ్ బాస్ కాళ్ల బేరానికి వచ్చారు. హౌస్ మేట్స్ అందరూ బిగ్ బాస్ కి సారీ చెప్తూ రిక్వస్ట్ చేస్కున్నారు. బిగ్ బాస్ మాత్రం హౌస్ మేట్స్ ని కనికరించలేదు. స్టోర్ రూమ్ ద్వారా కాస్ట్యూమ్స్ ని తీస్కుని టాస్క్ ని రద్దు చేశాడు.

అంతేకాదు, ఇక ఈసీజన్ మొత్తం కెప్టెన్సీ కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ టాస్క్ తో అయినా మారి హౌస్ మేట్స్ ఇక నుంచీ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తారా లేదా అనేది చూడాలి. అంతేకాదు, ఈ ప్రోమో కి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. బిగ్ బాస్ కరెక్ట్ గా చెప్పాడని, ఆడియన్స్ గా మేము ఏం అనుకుంటున్నామో అదే చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!


ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus