బిగ్ బాస్ లో శివాజీ దెబ్బకి సోషల్ మీడియా షేక్ అయిపోయింది. తను శోభా, ఇంకా ప్రియాంక ఇద్దరినీ ఉద్దేశ్యించి అన్నమాటలు సోషల్ మీడియాని వేడెక్కించాయి. దీంతో శనివారం నాగార్జున ఆడియన్స్ సైతం అడ్రస్ చేస్తూ శివాజీకి క్లాస్ పీకారు. తను అన్నమాటలని జనరలైజ్ చేయద్దని, నేను అలా ఎందుకు అంటాను అంటూ శివాజీ నాగార్జునతో వాగ్వివాదానికి దిగాడు. నువ్వు చేసింది బ్లండర్ అని, హిమాలియన్ బ్లండర్ అంటూ నాగార్జున శివాజీకి ఒక రేంజ్ లో క్లాస్ పీకారు. అంతేకాదు, అక్కడున్న ఆడియయన్స్ తో కూడా నువ్వు మాట్లాడింది తప్పు అంటూ చెప్పించారు.
దీంతో శివాజీకి సిట్యువేషన్ అర్దమైంది. నేను అందర్నీ ఉద్దేశ్యించి అనలేదని, అలాంటి ఆడపిల్లలు నా ఇంట్లో ఉంటే ఆ మాట అన్నానని చెప్పి సమర్ధించుకోబోయాడు. ఇక హోస్ట నాగార్జున నేను నీ ప్లేస్ లో ఉంటే ఖచ్చితంగా వెళ్లి సారీ చెప్తానని చెప్పేసరికి శివాజీ తన తప్పు తెలుసుకున్నాడు. కన్ఫెషన్ రూమ్ నుంచీ వచ్చి శోభాశెట్టికి అలాగే ప్రియాంకకి ఇద్దరికీ సారీ అమ్మా అంటూ చెప్పాడు. కానీ, ఈ ఇష్యూ ఇంతటితో ఆగిపోలేదు. ఆదివారం సోషల్ మీడియాలో దద్దరిల్లిపోయింది. హోస్ట్ నాగార్జున తీరుని తప్పుబడుతూ చాలామంది ఆడియన్స్ ధ్వజమెత్తారు. వాళ్ల కామెంట్స్ తో సోషల్ మీడియా అన్ని ఫ్లాట్ ఫార్మ్స్ ని వేడెక్కించారు.
మీకు సీరియల్ బ్యాచ్ చేసే తప్పులు కనిపించలేదా.. ? వాళ్లతో పల్లవి ప్రశాంత్ కి సారీ చెప్పించలేదు. అలాగే యావర్ కి కూడా సారీ చెప్పించలేదు కానీ, ఇప్పుడు చిన్న పాయింట్ పట్టుకుని శివాజీతో ఇంకా యావర్ తో శోభాకి సారీ చెప్పిస్తారా అంటూ కామెంట్స్ చేశారు. అసలు ఏం జరిగిందంటే., బాల్స్ టాస్క్ లో శివాజీ శోభాశెట్టి మాటలకి ఇరిటేట్ అయ్యాడు. అంతేకాదు, ప్రియాంకని ఎంకరేజ్ చేస్తుంటే ఫ్రస్టేట్ అయిపోయి ఆటలోనుంచీ వైదొలిగాడు. ఆ తర్వాత శోభాని ప్రియాంకని ఉద్దేశ్యించి చాలా కామెంట్స్ చేశాడు.
ఇలాంటి ఆడపిల్లలు నా ఇంట్లో ఉంటే నాలుగు పీకి చెప్తా అని, గొంతు మీద కాలేసి తొక్కేస్తా అంటూ బ్యాడ్ కామెంట్స్ చేశాడు. శివాజీ మాట్లాడింది జనరలైజ్ కాకపోయినా దాని అర్దం అదే బయటకి వచ్చింది. ఇందో భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అందరి ఆడపిల్లలని ఉద్దేశ్యించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదండూ అందరూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అంతేకాదు, శివాజీ వాళ్ల మొగుళ్లు ఎలా వేగుతారో ఏంటో, రేపొద్దున్న వీళ్లకి మొగుళ్లు వస్తే ఏమవుతారో అనే భావనతో మాట్లాడాడు. దీంతో హోస్ట్ నాగార్జున ఒక మాట అన్నారు ఏంటంటే,
నీ మాటలు విని రేపొద్దున్న వాళ్లని చేసుకోబోయేవాళ్లు వదిలేస్తే ఏంటి అని అంటే, దానిని కూడా శివాజీ వాళ్లు వీళ్ల గేమ్ చూడట్లేదా బాబుగారు అంటూ తన మాటలని సమర్ధించుకోబోయాడు. కానీ చివరకి వచ్చి సారీ చెప్పాడు. అంతేకాదు, ఆదివారం హౌస్ మేట్స్ తో గేమ్ ఆడిస్తూ ఏ వారం మీరు రిగ్రేట్ గా ఫీల్ అయ్యారు అంటే, శివాజీ మాత్రం ఈవారమే అని చెప్పి, శోభాశెట్టిని అలాగే ప్రియాంకని అలా అని ఉండకూడదని, నేను ఫ్లో లో అన్నమాటలే తప్ప అందరినీ ఉద్దేశ్యించి కాదని చెప్తు క్షమాపణలు చెప్పాడు. ఇక్కడితో (Bigg Boss 7 Telugu) ఈ సీన్ కి ఎండ్ కార్డ్ పడింది.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!