Bigg Boss 7 Telugu: హౌస్ మేట్స్ కళ్లు తెరుస్తారా.. ! బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. వినాయక చవితి ఫెస్టివల్ చేసుకోమని పూజా సామాగ్రి పంపించిన బిగ్ బాస్. ఈసారి మూడోవారం మూడు వారాల ఇమ్యూనిటీ టాస్క్ కోసం పోటీ పడే ముగ్గురు కంటెస్టెంట్స్ పేర్లు చెప్పాడు. ఇందులో అమర్ దీప్, శోభాశెట్టి, ఇంకా ప్రిన్స్ యవార్ లు ఉన్నారు. అయితే, ఈ ముగ్గురిపైనే ప్రేమ ఎందుకు అనేది బిగ్ బాస్ ఆడియన్స్ కి పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే, రణధీర టీమ్ లో గెలిచినపుడు ఈ ముగ్గురు మాయాస్త్రం లేకుండా ఖాళీ చేతులతో ఉన్నారు.

అయితే, సందీప్ ఎంచుకోవడం వల్ల అమర్ దీప్ కంటెండర్ గా మారాడు. అక్కడే ప్రిన్స్ కి కానీ, శోభాశెట్టికి కానీ అవకాశం రాలేదు. అందుకే వీళ్ల పేర్లు చెప్పాడు బిగ్ బాస్. ఇక్కడ ప్రియాంక కూడా ఈ లిస్ట్ లో ఉంది కానీ, బిగ్ బాస్ ప్రియాంకకి అవకాశం ఇవ్వలేదు. అమర్ కి ఇచ్చాడు. అంతేకాదు, ఈ ముగ్గురులో ఎవరు అనర్హులో హౌస్ మేట్స్ ని చెప్పమని ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పారు. ప్రియాంక అమర్ పేరు చెప్పింది. మిగతా వాళ్లు శోభాశెట్టి ఇంకా ప్రిన్స్ పేర్లు చెప్పాడు.

వీరిద్దరికీ చిరో మూడు ఓట్లు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ ఎవరెవరు ఎవరి పేర్లు చెప్పారు. కారణాలు ఏం చెప్పారు అనేది హౌస్ మేట్స్ ని లివింగ్ రూమ్ లో కూర్చొబెట్టి మరీ చూపించాడు. దీంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అసలు బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏంటి. స్ట్రాటజీ ఏంటి అనేది ఒక్కసారి చూసినట్లయిత్., అమర్ దీప్ కి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది. కానీ, ప్రిన్స్ కి ఇంకా శోభాశెట్టికి ఛాన్స్ రాలేదు. దీంతో వాళ్ల పేర్లతో పాటుగా అమర్ పేరుని యాడ్ చేశాడు.

నిజానికి హౌస్ మేట్స్ లో బుర్రలో ఏమాత్రం గుజ్జు ఉన్నా అమర్ పేరు వాడతారు. అమర్ కి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకి కూడా అవకాశం రావాలని తెలివిగా తన పేరు చెప్తారు. కానీ, ఇక్కడ ప్రియాంక తప్పించి ఎవ్వరూ కూడా అమర్ పేరు చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా హౌస్ మేట్స్ కళ్లు తెరుస్తారని, జెన్యూన్ గేమ్ ఆడతారని బిగ్ బాస్ ఈ టెస్ట్ పెట్టినట్లుగా అనిపించింది. కానీ, అందులో హౌస్ మేట్స్ ఫైయిల్ అయ్యాడు.

ఇక ఎప్పటిలాగానే బిగ్ బాస్ హౌస్ మేట్స్ చెప్పిన రీజన్స్ పార్టిసిపెంట్స్ కి చూపించి లొల్లి పెట్టాడు. ప్రిన్స్ కి మూడు ఓట్లు వచ్చాయి. ఇందులో శుభశ్రీ ఇంకా రతిక ఇద్దరూ తన పేరు చెప్పడాన్ని ప్రిన్స్ తీస్కోలేకపోయాడు. ముఖ్యంగా రతిక తనకి వెన్నుపోటు పొడుస్తుందని అస్సలు అనుకోలేదు. హౌస్ లో వర్క్ చేయాలా.. ఏం వర్క్ చేయాలి చెప్పండి. మీ బట్టలు ఉతకమంటారా అంటూ శుభశ్రీ పై సీరియస్ అయ్యాడు యావార్. కావాలనే బిగ్ బాస్ ఇలా చేశాడని ఇది (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ అని ఇప్పటికైనా హౌస్ మేట్స్ కి అర్ధం అవుతుందో లేదో చూడాలి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus