బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ఎంతోమంది కంటెస్టెంట్ల కెరీర్ కు ప్లస్ కాగా కొంతమంది కెరీర్ కు మాత్రం మైనస్ అయింది. బిగ్ బాస్ షో సీజన్6 రేటింగ్స్ దారుణంగా ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో ఫీలవుతున్నారు. నాగార్జున ఎంతో కష్టపడి హోస్ట్ చేస్తున్నా ఆ కష్టానికి తగ్గ ఫలితం లభించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షో రేటింగ్ విషయంలో రేవంత్ మాత్రమే హోప్ గా మిగిలారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
బిగ్ బాస్ షో నుంచి రాబోయే రోజుల్లో రేవంత్ ఎలిమినేట్ అయితే మాత్రం ఈ షో రేటింగ్ పై ఊహించని స్థాయిలో ప్రభావం పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతాడో లేదో చూడాల్సి ఉంది. రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఫ్యాన్స్ కోరిక తీరుతుందో లేదో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ షో గత సీజన్ల స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. బిగ్ బాస్ షో వీకెండ్ రేటింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ షోలో ఇస్తున్న టాస్క్ లు కొత్తగా లేవని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ షో తర్వాత సీజన్లు ఉంటాయో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే లాస్ట్ సీజన్ ఇదేనని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నాగార్జున బిగ్ బాస్ షో సీజన్6 కు 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేశారని
వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. నాగార్జున నటించిన సినిమాలలో చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. నాగార్జున సైతం కొంతకాలం షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారు. త్వరలో నాగ్ వందో ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!