యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి స్టార్ మా ఛానల్లో ప్రసారమైన బిగ్ బాస్ షో సీజన్ వన్ కి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తన చార్మింగ్ తో, మాటల మ్యాజిక్ తో తెలుగు వాళ్ళను టీవీలకు అతుక్కుపోయేలా చేశారు. అంతేకాదు నాలుగో స్థానంలో ఉన్న మాటీవీని మొదటిస్థానంలోకి తెచ్చిపెట్టారు. పేరు తెచ్చిన షోని స్టార్ మా వాళ్ళు మళ్ళీ ఇంకొంచెం మాసాలతో ప్రారంభించారు. సీజన్ 2 కి మాత్రం తారక్ రాలేదు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాదిరిగా ఆకట్టుకోలేకపోయారని విశ్లేషకులు విమర్శించారు. ప్రేక్షకులు కూడా సీజన్ వన్ మాదిరిగా లేదని పెదవి విరిచారు. వారు, వీరు చెప్పడమే కాదు.. అసలైన లెక్కలు వచ్చేసాయి. బ్రాడ్ క్యాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అందించిన రేటింగ్ ప్రకారం ఎన్టీఆర్ ని నాని రీచ్ కాలేకపోయినట్లు స్పష్టమయింది.
బిగ్ బాస్ సీజన్ వన్ ఫస్ట్ వారానికి వీకెండ్స్(శని, ఆదివారం) లో 16.18 టీఆర్పీ(టెలివిజన్ రేటింగ్ పాయింట్) సాధించింది. సీజన్ టు వీకెండ్స్ లో 15.05 టీఆర్పీ నమోదైంది. సీజన్ 1 వీక్ డేస్ (సోమ, మంగళ, బుధ, గుర, శుక్ర)లో 9.24 టీఆర్పీ రాబట్టగా.. సీజన్ టు తొలివారం వీక్ డేస్ లో 7.93 టీఆర్పీ కి పరిమితమయింది. సో షో కూడా ఇదివరకు ఇచ్చిన కిక్ ని ఇవ్వలేకపోయినట్లు స్పష్టం అవుతోంది. ఈ విషయాన్నీ ముందే గుర్తించిన షో నిర్వాహకులు సంజనని తీసేసి నందిని ని హౌస్ లోకి పంపించారు. మరింత ఆసక్తి కలిగించడానికి అనేక కొత్త ఛాలెంజెస్ ని పార్టిసిపెంట్స్ ముందు ఉంచుతున్నారు. రెండో వారంలోనైనా షో పుంజుకుంటుందోమో చూడాలి.