తెలుగు “బిగ్ బాస్” సెకండ్ సీజన్ హోస్ట్ ఎవరో తెలుసా?
- August 24, 2017 / 01:23 PM ISTByFilmy Focus
వెండితెరపై తనదైన నటనతో ఎన్టీఆర్ అదరగొట్టారు. ఇప్పుడు బుల్లితెరపైనా సందడి చేస్తున్నారు. ఆయన తొలిసారి వ్యాఖ్యాతగా చేస్తున్న బిగ్ బాస్ షో రికార్డులను తిరగరాస్తోంది. ఇది వరకు ఏ తెలుగు రియాల్టీ షో కి రాని రేటింగ్స్ బిగ్ బాస్ కి వస్తున్నాయి. తొలి రోజు (జులై 16) 16.18 టీఆర్పీ (టెలివిజన్ రేటింగ్ పాయింట్) సాధించిన ఈ షో అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు స్టార్ మా ఛానెల్ ని చూసే వీక్షకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. నాలుగు వారాలుగా టీవీఆర్ (టెలివిజన్ వీవర్స్ రేటింగ్) లో తొలి స్థానంలో నిచ్చిన ఈ షో ఐదవ వారం కూడా మొదటి స్థానాన్ని కొనసాగించింది. స్టార్ మా ఛానల్ కి తారక్ తన హోస్టింగ్ తో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు.
టెలివిజన్ ఛానల్లో పోటీలో ముందు స్థానంలో నిలబెట్టారు. దీంతో బిగ్ బాస్ షో సెకండ్ సీజన్ ని కూడా నిర్వహించడానికి ఇప్పటి నుంచే పనులు మొదలెట్టారు. పార్టిసిపెంట్స్ విషయంలో సెలక్షన్స్ కి రంగంలోకి దిగిన టీమ్ హోస్ట్ విషయంలో ఫిక్స్ అయిపోయారు. రెండో సీజన్ కి కూడా ఎన్టీఆర్ నే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తన ఎనర్జీతో షో ని ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టారని, అతన్ని మార్చే ప్రసక్తి లేదని తెలిసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















