Bigg Boss: వైరల్ అవుతోన్న బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్!

బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఫారెన్ కంట్రీస్ నుంచి ఈ షో ఇండియాకు పాకింది. నార్త్ లో ఈ షో సక్సెస్ కావడంతో దక్షిణాదిలో అన్ని భాషల్లో బిగ్ బాస్ షో మొదలుపెట్టేశారు. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. రీసెంట్ గా ఓటీటీ వెర్షన్ ను కూడా మొదలుపెట్టారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో 24 గంటల పాటు ఈ షోని టెలికాస్ట్ చేశారు.

కానీ ఆశించిన స్థాయిలో ఈ షో సక్సెస్ కాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6పై ఫోకస్ పెట్టారు నిర్వాహకులు. ఇందులో భాగంగా ముందుగా కంటెస్టెంట్స్ లిస్ట్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ నుంచి చాలా మంది కాల్స్ వెళ్లాయి. అయితే కొందరిని మాత్రం ఫైనల్ చేయాలనుకుంటున్నారు. ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే..? యాంకర్ వర్షిణి, నవ్యా స్వామీ, దీపికా పిల్లి, యాంకర్ ధన్షు, చైత్రారాయ్, ఆది.

ప్రస్తుతం వీరితో అగ్రిమెంట్ సైన్ చేయించే పనిలో ఉన్నారు నిర్వాహకులు. వీరితో పాటు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కనిపించిన కొందరు కంటెస్టెంట్స్.. సీజన్ 6లో కనిపించే ఛాన్స్ ఉంది. యాంకర్ శివ, మిత్రాశర్మ, అనిల్ రాథోడ్ లలో ఎవరైనా బిగ్ బాస్ సీజన్ 6లో అలరించనున్నారని సమాచారం. ఎవరనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈసారి సీజన్ 6ని చాలా ఎంటర్టైనింగ్ గా ప్లాన్ చేస్తున్నారట.

గతంలో బిగ్ బాస్ షోలో కామన్ మ్యాన్ కనిపించినా.. ఆ తరువాత ఆ కాన్సెప్ట్ ను పక్కన పెట్టారు. కానీ ఈసారి హౌస్ లో కామన్ మ్యాన్ కి అవకాశం ఇస్తున్నారు. అలానే కొన్ని టాస్క్ లను బిగ్ బాస్ హిందీ, కన్నడ భాషల నుంచి తీసుకోబోతున్నారట. సెప్టెంబర్ మొదటివారంలో ఈ షో మొదలవుతుందని అంటున్నారు. ఈ సీజన్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus