బిగ్ బాస్ సీజన్ – 6 లో 12 మంది పార్టిసిపెంట్స్ వీళ్లేనా..!

ఓటీటీ నాన్ స్టాప్ సీజన్ అయిపోయిన తర్వాత సీజన్ సిక్స్ కి బిగ్ బాస్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఓటీటీ సీజన్ అయిపోయిన రెండు నెలలకే ఈ షోని టెలివిజన్ లో టెలికాస్ట్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ షో జులై 31వ తేదిన లేదా ఆగష్టు 7వ తేదిన టెలికాస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సీజన్ లో ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పుడు జరిగిన ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నుంచీ ఐదుగురు సీజన్ – 6 లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరిలో ఆర్జే చైతూ ఈసారి టెలివిజన్ లో ఖచ్చితంగా వచ్చేస్తాడు. లాస్ట్ టైమ్ ఒక మంచి ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసినా కూడా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. అయితే, ఆర్జే చైతూకి ఛాన్స్ ఉంది.

ఒకవేళ తను ఏదైనా కారణాల వల్ల రాలేకపోతే ఆర్జే కేటగిరిలో ఇంకొకరిని తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ తీసుకుంటే ఆర్జే హేమంత్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్జే హేమంత్ ఆర్టిస్ట్ గా చాలామందికి తెలుసు. చాలా సినిమాల్లో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ఆర్జే గా, ఆర్టిస్ట్ గా తెలుగు వాళ్లకి బాగా సుపరిచితుడు.

తర్వాత ఓటీటీ సీజన్ నుంచీ అజయ్ కంపల్సరీగా రావచ్చు. లాస్ట్ టైమ్ గేమ్ చాలా బ్యాలెన్స్ గా ఆడాడు. కొంత సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లేకపోవడం అనేది మనోడికి దెబ్బ పడింది. అజయ్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఓటీటీ సీజన్ నుంచీ యాంకర్ శివ ఆల్రెడీ సీజన్ 6కి రావాలని అనుకున్నాడు. ఈ విషయం నాగార్జునని స్టేజ్ పైన అడిగాడు కూడా. యాంకర్ శివకి కూడా బిగ్ బాస్ టీమ్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

ఇక నెక్ట్స్ అనిల్ రాథోడ్ కి కూడా బిగ్ బాస్ సీజన్ 6లో ప్లేస్ ఇవ్వచ్చు. మరి అనిల్ దీన్ని తీసుకుంటాడా లేదా అనేది చూడాలి. నిజానికి ఓటీటీలో టాప్ – 5 లో ఉన్నవాళ్లకి , ఫైనలిస్ట్ లకి సీజన్ 6లో ఛాన్స్ దొరుకుతుందని టాక్ వచ్చింది. మరి దీని ప్రకారం ఇస్తే ఖచ్చితంగా అనిల్ కి ఛాన్స్ ఉంటుంది.

నెక్ట్స్ ఇదే విధంగా మిత్రా శర్మా కి కూడా సీజన్ 6లో మరోసారి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఇదే సీజన్ లో పార్టిసిపేట్ చేసిన స్రవంతి చొక్కారపు కూడా సీజన్ 6లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఓటీటీ సీజన్ నుంచీ వీళ్లే పేర్లు వినిపిస్తున్నాయి. ఓటీటీ సీజన్ నుంచీ ఐదుగురుని మాత్రమే తీస్కునే ఛాన్స్ ఉంది. అంతకంటే ఎక్కువ మందిని తీసుకుంటే మళ్లీ ఆ సీజన్ కి దీనికి తేడా లేకుండా పోతుంది. ఐదుగురు లేదా దానికంటే తక్కువ మందినే సెలక్ట్ చేస్తారు.

నెక్ట్స్ పార్టిసిపెంట్ గా యాంకర్ రోజా లేదా యాంకర్ ప్రత్యూష ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ లోకి రావచ్చు. అయితే, డెసీషన్ అనేది ఇప్పుడు కంప్లీట్ గా పార్టిసిపెంట్స్ పైనే ఉంది. ఆఫర్ అయితే ఇధ్దరికీ ఉంది. మరి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాలి.

నెక్ట్స్ ఏడో పార్టిసిపెంట్ గా అయితే మామా సింగ్ పేరు వినిపిస్తోంది. మామా సింగ్ – అలియాస్ కృష్ణ చైతన్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి ర్యాప్ సింగర్. సోషల్ మీడియాలో కొద్దిమందికి తెలుసు. మంచి ఫేమ్ కూడా ఉంది. సినిమాల్లో కూడా ర్యాప్ పాడాడు. ఇన్ స్ట్రా గ్రామ్ లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు.

తర్వాత ఆర్టిస్ట్ అమరదీప్ చౌదరి వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైమ్ సన్నీ -మానస్ ల కోసం స్టేజ్ పైకి వచ్చాడు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ఛాన్సెస్ హై గా ఉన్నాయి. ప్రస్తుతం రెండు మూడు సీరియల్స్ చేస్తున్నాడు. మా టీవితో మంచి అనుబంధం ఉంది. కాబట్టి ఛాన్స్ ని వదులుకోడు.

నెక్ట్స్ ఆర్టిస్ట్ కౌషిక్ వచ్చే ఛాన్స్ ఉంది. చైల్డ్ ఆర్డిస్ట్ గా చాలామందికి మనోడు పరిచయం. అయ్యప్పస్వామి క్యారెక్టర్ లో చాలామంది తెలుగు వాళ్లకి తెలుసు. అంతేకాదు, రీసంట్ గా వెబ్ సీరిస్ లో కూడా చేశాడు. మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. మంచి యంగ్ ఆర్టిస్ట్, సినిమాల్లో అవకాశాలకోసం చూస్తున్నాడు. ఈ సీజన్ 6లో హైలెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

యాంకర్ ఉదయ్ భాను. లాస్ట్ టైమ్ సీజన్ 5లో చాలా గట్టిగా వినిపించిన పేరు. కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. ఇప్పుడు ఈ సీజన్ కి ఖచ్చితంగా ఓకే చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. సర్ ప్రైజ్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టచ్చు. ఉదయ భాను వస్తే సీజన్ 6 అనేది మరో లెవల్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది.

ఇంకా ఇద్దరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అందులో సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ నిఖిల్ పేరు. నిఖిల్ సెలబ్రిటీస్ ని ఇంటర్య్వూ చేస్తుంటాడు. కాస్కో ఛానల్ కూడా ఉంది. సీజన్ 5లో స్టేజ్ పైకి కూడా వచ్చాడు. లాస్ట్ మినిట్ లో పార్టిసిపేట్ చేయాల్సింది డ్రాప్ అయ్యాడు.

ఇక నెక్ట్స్ 12వ పేరు గెటప్ శీనుది. గెటప్ శీను మనందరికీ తెలుసు. జబర్ధస్త్ లో ఫుల్ ఎంటర్ టైన్ చేస్తాడు. కావాల్సిన మసాలా కంటెంట్ అంతా ఇస్తాడు. బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి పార్టిసిపెంట్ ఉంటే టాస్క్ ల్లో రెచ్చిపోయి మరీ పెర్ఫామ్ చేస్తాడు. గెటప్స్ వేయాల్సిన కూడా ఇరగదీసేస్తాడు.

Getup srinu to file complaint at cybercrime police1

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.