Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

  • June 19, 2025 / 05:23 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

సెవెన్ హిల్స్ బ్యానర్ పై వేణుదారి బేబీ నేహశ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా నటిస్తుండగా పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి తనతో జంటగా నటించారు. పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రం ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజిని వర్మ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి త్రిలోక్ సిద్దు సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జుడా సంధ్య చిత్రానికి సంగీతం అందించారు. జులై 4వ తేదీన వెండి ధరపై ప్రేక్షకులను పలకరించనున్న సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇటీవలే భారతదేశ రక్షణాదనం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మురళి నాయక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ… “మేము ఎంతో పేద కుటుంబం నుండి వచ్చాము. మాకు ఉన్న ఒక్క కొడుకు దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. మా కొడుకు ఈరోజు మాకు దూరమైనప్పటికీ గౌతమ్ లాంటి మరొక కొడుకు మాకు దొరికాడు అనుకుంటాము. గౌతమ్ మాట్లాడుతుంటే మా అబ్బాయి మాట్లాడుతున్నట్లే ఉంది. అందుకే నేడు వేరే పని ఉన్నా కూడా కేవలం ఈ చిత్రం కోసం వచ్చాము. గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ రాబోతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము” అన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ… “చిత్ర ట్రైలర్ ఎంతో బాగుంది. చాలా మంచి విజువల్స్ కనిపించాయి. సాధారణంగా ఎవరైనా కొత్త నిర్మాతలు చిత్ర పరిశ్రమంలోకి వచ్చినప్పుడు ప్యాషన్ తో వచ్చాము అంటారు కానీ ఒకటి రెండు సినిమాలు తీసిన తర్వాత వెళ్ళిపోతారు. కానీ సతీష్ అలా వెళ్ళిపోయేవాడు కాదు. నిజమైన ప్యాషన్ తో వచ్చి ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్నాడు. చిత్ర బృందం అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత రోజులలో ఏదైతే మంచి విజయం సాధిస్తుందో అదే పెద్ద సినిమా. అంతేకానీ ఇక్కడ చిన్న సినిమా అంటూ ఏమీ లేదు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ సుధాకర్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. నా మొదటి సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా ఇక్కడే ట్రైలర్ లాంచ్ చేసాము. చిత్రం మంచి విజయం సాధించింది. అలాగే సోలో బాయ్ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన సతీష్ గారు సినిమా మీద ఉన్న ప్యాషన్ తో నిర్మాతగా మారారు. చిత్రానికి ఎంతో గొప్పవారు పాటల అందించారు. చిత్రానికి గౌతమ్ కూడా కొంత డబ్బు ఖర్చుపెట్టడం జరిగింది. అలాగే మురళి నాయక్ కుటుంబాన్ని ఆహ్వానించినందుకు చిత్ర బంధాన్ని అభినందిస్తున్నాను” అన్నారు.

దర్శకుడు యాట సత్యనారాయణ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా నమస్కారం. ముందుగా దేశ రక్షణ కోసం తన ప్రాణాలను నడిపించిన మురళి నాయక్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎంతో చిన్న వయసులోనే తనకు వేరే ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ వారిని కాదనుకుని మిలటరీ కి వెళ్లి దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు మురళి నాయక్. అటువంటి వ్యక్తిని ఈ దేశానికి అందించినందుకుగాను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మురళి నాయక్ భారత దేశంలోని మహిళల నుదుటిపై సింధూరం ఉన్నంతవరకు జీవించే ఉంటాడు. ఈ సినిమా చిన్నది అంటున్నారు కానీ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిభవంతులు. కాబట్టి ఇది చిన్న సినిమా కాదు. కరోనా సమయంలో బట్టల రామస్వామి చిత్రంతో ఓటిటి ద్వారా మంచి విజయాన్ని సాధించిన సతీష్ ఇప్పుడు వెండితెరపై మరోసారి విజయాన్ని సాధించబోతున్నారు. ట్రైలర్ చూస్తే డైరెక్టర్ గారు సినిమాను ఎంత బాగా తీశారో అర్థమవుతుంది. చిత్రంలో నటించిన ప్రతి నటీనటులు అందరికీ బాగా తెలిసిన వారు, ఎంతో బాగా నటించారు. చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర దర్శకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ… “ఈ చిత్ర కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా దేశం కోసం ప్రాణాలు నడిపించిన మురళి నాయక్ కుటుంబానికి ఎటువంటి సందర్భంలో అయినా మనమంతా తోడుగా ఉండాలి అని కోరుకుంటున్నాను. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్నారు. సోలో బాయ్ చిత్రం మధ్య తరగతి కుటుంబాలను ప్రతిభంబిస్తూ ఉంటుంది. చిత్రంలో నటించిన నటీనటులు అందరూ అందరికీ తెలిసిన వారే. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను ఎంతో బాగా పోషించారు. అలాగే చిత్రం కోసం ఎంతో బలమైన టెక్నికల్ బృందం పనిచేశారు. గౌతమ్ కృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు. నాకు అవకాశం ఇచ్చిన మా నిర్మాత సతీష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జులై 4వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అందరూ కచ్చితంగా థియేటర్ కు వెళ్లి ఈ చిత్రాన్ని చూడండి” అన్నారు.

సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ… “దేశం కోసం ప్రాణాలకు అర్పించిన మురళి నాయక్ కుటుంబం కోసం త్వరలో ఒక మ్యూజికల్ నైట్ జరిపి తద్వారా ఆదాయాన్ని వారి కుటుంబానికి అందజేయాలని అనుకుంటున్నాను. ఇక సోలో బాయ్ చిత్రం గురించి చెప్పాలంటే ముందుగా నిర్మాత సతీష్ గురించి చెప్పాలి. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుండి చూస్తున్నాను. ఆయనకు సినిమా అంటే పిచ్చి. తనకు వచ్చిన ప్రతి రూపాయి సినిమా పైన పెడతారు. అలాగే గౌతమ్ కృష్ణ ఎంతో అంకితభావంతో పనిచేసే నటుడు. భవిష్యత్తులో గౌతమ్ ఎంత ఉన్నత స్థాయికి వెళ్తాడని తెలుస్తుంది. అతడిని చూస్తుంటే ఉదయ్ కిరణ్ ను చూస్తే వచ్చే ఫీలింగ్ వస్తుంది. అతడిలాగానే వరుస విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర దర్శకుడు నవీన్ దర్శకత్వంలో ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇస్తూ పనిచేశాను. ఆయన ఎంతో ప్రతిభావంతుడు. ఈ చిత్రం మంచి విజయం సాధించి చిత్ర బృందం అందరికీ మంచి పేరు చూసుకుని రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ… “చిత్ర ట్రైలర్ లంచ్ కు వచ్చిన అతిథులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ఒక సినిమా కోసం ఎంతోమంది కష్టపడి పని చేస్తారు. లక్షల మంది చూసి ఈ సినిమాను వారి ముందుకు తీసుకు వెళ్ళేది మీడియా వారే. కాబట్టి మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాకు మీడియా వారు పూర్తిగా సపోర్ట్ చేస్తూ చిన్న సినిమాలకు రివ్యూలు రెండు రోజుల తర్వాత ఇస్తూ ఆ సినిమాలను బ్రతికించాలని కోరుకుంటున్నాను. సోలో బాయ్ అనగానే ఎంతోమంది ఇక్కడికి సోలోగా వచ్చి ఉన్నత స్థాయికి చేరిన వారు నాకు గుర్తొస్తారు. అలాగే సోలో భాయ్ ఉంటూ వస్తున్న మా చిత్రాన్ని జులై 4వ తేదీన ప్రేక్షకులంతా థియేటర్ కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. చిత్రానికి సాంకేతిక బృందంగా పనిచేసిన వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. వారందరికీ ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో హీరోగా నటించిన గౌతమ్ కృష్ణ రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా ఒక పాయింట్లో సినిమాకు డబ్బులు తక్కువ అయిన సమయంలో తాను కూడా కొంత డబ్బు ఖర్చుపెట్టి సినిమాను ముందుకు తీసుకుని వెళ్లాడు. సినిమా విజయం సాధించిన తర్వాతే తాను డబ్బు తీసుకుంటాను అని అన్నాడు. ఈ సినిమా ద్వారా గౌతమ్ కు మంచి బ్రేక్ వచ్చి తను ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైన మురళి నాయక్ గారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాము. సినిమాలు అన్ని బాగుండాలని కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ గా నిలిచిన వారందరికీ థాంక్స్” అన్నారు.

హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… “మా చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ చిత్ర కథ మధ్య తరగతి కుటుంబాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం. నా మొదటి సినిమా అంతగా ఆదరణ పొందని సమయంలో బిగ్బాస్ కు వెళ్లే ముందు నన్ను నేను అన్వేషించుకున్నాను. అలా బయట చాలా సాధారణంగా అన్ని ఎమోషన్స్ ఉండేలా ఒక చిత్రం చేయాలని అనుకున్నాను. ఆ విధంగా ఈ చిత్రం మొదలైంది. ఈ కథ విన్న వెంటనే సతీష్ గారు తనకు ఉన్న ప్యాషన్ తో సినిమాను ఓకే చేయడం జరిగింది. ఒక చిన్న సినిమాతో పెద్ద హిట్టు కొడితే అది ఎన్నో తరాలపాటు గుర్తింపుతోందని మేము నమ్మాము. మీ చిత్రానికి పెద్దవారు ఎవరు పని చేయనప్పటికీ చిత్రంలో కంటెంట్ హీరోగా నిలుస్తుంది. ఈ సినిమాలో నేనే కాదు, నా పాత్ర ఎవరు పోషించినా కూడా సినిమా మంచి హిట్ అవుతుంది ఎందుకంటే కంటెంట్ అటువంటిది. చిత్ర దర్శకుడు నవీన్ గారు సైలెంట్ గా ఉండే వ్యక్తి అయినప్పటికీ ఎంతో ప్రతిభవంతులు. ఈ ట్రైలర్ ను దయచేసి మీరంతా ప్రమోట్ చేయండి. కొత్తవారిని ఎంకరేజ్ చేయండి. ఈ కార్యక్రమానికి మురళి నాయక్ కుటుంబాన్ని ముఖ్య అతిథులుగా పిలవడానికి కారణమేంటంటే ఈ చిత్రంలో సబ్జెక్ట్ చాలా బలంగా ఉంటుంది. చాలా చిన్న వయసులో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ లాంటి వ్యక్తి యొక్క కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని తద్వారా వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని కోరుకున్నాము. మాకు పెద్ద పెద్ద సెలబ్రిటీల కంటే ఈ కుటుంబీకులే పెద్దగా అనిపించరు. అందుకే వారిని ఆహ్వానించాము. నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది ప్రేక్షకులు మాత్రమే. కాబట్టి ఇకపై వీరందరి కోసం ఏదో ఒకటి చేయాలని చాలా బలంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. సమవర్తి అనే ట్రస్టు ద్వారా నాకు వచ్చే ప్రతి సంపాదనలోనూ సగం ఆ ట్రస్టుకు అందజేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బులో సగం ఆ ట్రస్టు ద్వారా ముందుగా ఒక లక్ష రూపాయలు మురళి నాయక్ గారి కుటుంబానికి అందజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ ద్వారా వీలైనంతమందికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. ప్రతి నెల నేను ఆ ట్రస్ట్ ద్వారా చేసే సహాయాన్ని నా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెడతాను” అంటూ ముగించారు.

ఈ కార్యక్రమం అనంతరం మురళి నాయక్ కుటుంబ సభ్యులను సోలో భాయ్ చిత్ర బృందం ఎంత గౌరవంగా సత్కరించడం జరిగింది.

నటీనటులు – గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు

సాంకేతిక బృందం:
కాస్ట్యూమ్స్ – రిషిక, వీణాధరి
సినిమాటోగ్రఫీ – త్రిలోక్ సిద్ధు
సంగీతం – జుడా సాండీ
కో-డైరెక్టర్ – కినోర్ కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – SK నయీమ్
లిరిక్ రైటర్స్ – శ్యామ్ కాసర్ల, పూర్ణా చారి, చైతన్య ప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి
కొరియోగ్రాఫర్: ఆటా సందీప్
బ్యానర్ – సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్
నిర్మాత – సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
దర్శకత్వం – పి. నవీన్ కుమార్
పి ఆర్ ఓ : మధు VR
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #gautam krishna
  • #Solo Boy

Also Read

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

related news

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

Divvala Madhuri: ‘బిగ్ బాస్ 9’.. 8వ వారం హౌస్ నుండి మాధురి ఔట్?

Divvala Madhuri: ‘బిగ్ బాస్ 9’.. 8వ వారం హౌస్ నుండి మాధురి ఔట్?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

trending news

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

9 hours ago
Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

9 hours ago
Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

9 hours ago
Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Akhanda 2: ప్యాటర్న్‌ మార్చలేదు.. పాన్‌ ఇండియా కోరిక యాడ్‌ చేశారు.. ఇలా వర్కవుట్‌ అవుతుందా?

Akhanda 2: ప్యాటర్న్‌ మార్చలేదు.. పాన్‌ ఇండియా కోరిక యాడ్‌ చేశారు.. ఇలా వర్కవుట్‌ అవుతుందా?

9 hours ago
KEERTHY SURESH: రియల్ లైఫ్ సావిత్రిలా కీర్తి సురేష్ రిస్కీ ప్లాన్

KEERTHY SURESH: రియల్ లైఫ్ సావిత్రిలా కీర్తి సురేష్ రిస్కీ ప్లాన్

1 day ago
Sonu Nigam and Mohammad Rafi: ఏఐ చేసిన మరో అద్భుతం ఈ వీడియో… ఇద్దరు స్టార్‌ సింగర్‌లు కలసి…

Sonu Nigam and Mohammad Rafi: ఏఐ చేసిన మరో అద్భుతం ఈ వీడియో… ఇద్దరు స్టార్‌ సింగర్‌లు కలసి…

1 day ago
Keerthy Suresh: ఎందుకిలా మారిపోయావ్‌.. వైరల్‌ క్వశ్చన్‌కి ఆన్సర్‌ ఇచ్చిన కీర్తి సురేశ్‌.. ఏమందంటే?

Keerthy Suresh: ఎందుకిలా మారిపోయావ్‌.. వైరల్‌ క్వశ్చన్‌కి ఆన్సర్‌ ఇచ్చిన కీర్తి సురేశ్‌.. ఏమందంటే?

1 day ago
Raj & DK: మరోసారి తనదైన మార్క్‌ చూపించిన రాజ్‌ – డీకే.. తొలి సీజన్‌లో చేసిందే మళ్లీ…

Raj & DK: మరోసారి తనదైన మార్క్‌ చూపించిన రాజ్‌ – డీకే.. తొలి సీజన్‌లో చేసిందే మళ్లీ…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version