Bigg Boss 6: మై విలేజ్ షో నుంచి బిగ్ బాస్ లోకి మరొకరు?

బుల్లి తెరపై ప్రసారమౌతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.అన్ని భాషలలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక తెలుగులో ఇప్పటికే ఈ కార్యక్రమం 5 సీజన్లను పూర్తి చేసుకొని ఆరవ సీజన్ ప్రసారం చేయడానికి సిద్ధమవుతుంది. అదేవిధంగా బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా లేడీ కంటెస్టెంట్ బిందుమాధవి ట్రోఫీ అందుకున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం పూర్తికాగానే నిర్వాహకులు బుల్లితెరపై సీజన్ 6 ప్రసారం చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ గా ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందనే వార్తలు వినపడుతున్నాయి.ఎప్పటిలాగే ఈ సీజన్లో కూడా సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ ఉన్న వారికి అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉండబోతుంది. బిగ్ బాస్ సీజన్ 3 నుంచిఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు ఇకపోతే ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లిస్ట్ ఇదేనంటూ పెద్ద ఎత్తున కొందరి పేర్లు వినపడుతున్నాయి. అయితే సీజన్ ఫోర్ లో మై విలేజ్ షో నుంచి గంగవ్వ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సీజన్ సిక్స్ లో గంగవ్వ తర్వాత మరొకరు మై విలేజ్ షో నుంచి మరొకరు బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందా అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రసారం కానుందని, సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారం అవుతుందని తెలుస్తోంది.మరి ఈ కార్యక్రమం గురించి వస్తున్న ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus