బిగ్ బాస్ హౌస్ లో పవర్ అస్త్రాని సాధించిన అర్జున్ ఫస్ట్ టాప్ 5 కంటెస్టెంట్ అయ్యాడు. అయితే, ఈవారం అర్జున్ ఎవిక్షన్ నుంచీ సేవ్ అవ్వాల్సి ఉంటుంది. ఈవారం సేఫ్ అయితేనే ఫినాలేలోకి అడుగుపెట్టినట్లు. ఇంకొక్క వారమే నామినేషన్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత వారం బిగ్ బాస్ అందర్నీ నామినేషన్స్ లోకి పంపించేస్తాడు. హౌస్ మొత్తం నామినేట్ అయిపోతుంది. ఒక్కొక్కరి జెర్నీ వీడియోస్ కూడా ప్లే చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఫినాలే అస్త్రా టాస్క్ లో పల్లవి ప్రశాంత్ కి అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేడెక్కిపోతోంది.
డోపవర్ అస్త్రా టాస్క్ లో మొత్తం పది టాస్క్ లు అయిన తర్వాత అమర్ దీప్ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కూడా టాప్ లో ఉన్నారు. మూడో స్థానంలో అర్జున్ ఉన్నాడు. అయితే, ఇక్కడే బిగ్ బాస్ బలం ప్రయోగం ఉన్న టాస్క్ పెట్టాడు. రోప్స్ ని నడుంకి కట్టుకుని జెండాలని బాస్కెట్ లో వేయాలి. ఈ టాస్క్ లో బలం ఉన్నవాళ్లే గెలుస్తారు. అర్జున్ కి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అర్జున్ విన్నర్ అయ్యాడు. దీంతో పల్లవి ప్రశాంత్ మూడో స్థానంలో సెటిల్ అయ్యాడు. ఈ టాస్క్ తర్వాత పల్లవి ప్రశాంత్ బలప్రయోగం ఉంది అన్నా, నేను చేయలేకపోయాను అంటూ నిరుత్సాహ పడ్డాడు ఏడ్చాడు.
దీంతో కావాలనే బిగ్ బాస్ పదకొండో టాస్క్ పెట్టాడని, పల్లవి ప్రశాంత్ కి ఫినాలే టిక్కెట్ రాకూడదనే ఇలా చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అసలు టాస్క్ లో ఏం జరిగిందంటే., బిగ్ బాస్ ఫినాలే అస్త్రాని సాధించేందుకు మొత్తం 11 టాస్క్ లు పెట్టాడు. ఇందులో ఒక్కొక్కరికీ ఒక్కో ఎడ్వాంటేజ్ అనేది ఉంది. చివరి టాస్క్ లక్కీగా అర్జున్ కి అడ్వాంటేజ్ అయ్యింది. అంతేకానీ, కావాలని పల్లవి ప్రశాంత్ ని తొక్కేసే ప్రయత్నం చేయలేదు. ఇంకోటి ఏంటంటే, ఈ టాస్క్ లలో అర్జున్ చాలా టాస్క్ లు గెలిచాడు. పల్లవి ప్రశాంత్ కొన్ని టాస్క్ లు గెలిచాడు.
అయితే, రోప్ టాస్క్ కంటే ముందే కలర్స్ ఎరేంజింగ్ టాస్క్ వచ్చింది. నిజానికి ఇది పల్లవి ప్రశాంత్ చాలా ఫాస్ట్ గా చేయగలడు. కానీ, ఖంగారు పడ్డాడు. ఇది పల్లవి ప్రశాంత్ కి అడ్వాంటేజ్ ఉన్న టాస్కే. కానీ, చేయలేకపోయాడు. టాస్క్ లలో 10 టాస్క్ లతో ముగించేస్తే పల్లవి ప్రశాంత్ నెంబర్ 2 పొజీషన్ లో ఉండేవాడు. కానీ, బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఇంకో టాస్క్ ఇచ్చాడు. ఇది కూడా ఎందుకంటే, ప్రియాంకని ఐదో టాస్క్ ఆడించి ఎలిమినేట్ చేశారు. అక్కడ బిగ్ బాస్ లెక్క మారింది.
ఆ తర్వాత గౌతమ్ వెళ్లిపోతూ అర్జున్ కి పాయింట్స్ ఇవ్వకుండా అమర్ కి ఇచ్చాడు ఇక్కడ కూడా బిగ్ బాస్ లెక్క మారింది. అందుకే, ఇంకో అవకాశం ఆటగాడిగా నిరూపించుకునేందుకు ఇచ్చాడు. మొత్తం 11 టాస్క్ లలో ఐదు టాస్క్ లు అర్జున్, నాలుగు టాస్క్ లు పల్లవి ప్రశాంత్, రెండు టాస్క్ లు అమర్ దీప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఓవర్ ఆల్ గా అమర్ తో పాము టాస్క్ లో పోటీ పడి గెలిచి ఫిినాలే అస్త్రాని సొంతం చేసుకున్నాడు అర్జున్. అదీ జరిగింది.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!