బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం పూర్తి అయ్యి దాదాపు నెలరోజుల అవుతున్న ఇప్పటికీ ఈ కార్యక్రమం గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి నటుడు శివాజీ ఈ కార్యక్రమం తరువాత వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ కార్యక్రమం గురించి చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా శివాజీ బిగ్ బాస్ కార్యక్రమంలో జరిగే ఓటింగ్ గురించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాకుండా ఉండడం కోసం మనం ఓటింగ్ చేస్తుంటాము దీనిని రెండు విధాలుగా చేస్తాము ఒకటి హాట్స్టార్ లో లాగిన్ అయ్యి వారికి ఓటు వేయడం లేదంటే మిస్సేడ్ కాల్ ఇవ్వడం ద్వారా వారికి వోట్ చేయవచ్చు అయితే ఏ కంటెంట్ కి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందనే విషయాలను మాత్రం మనకు తెలియచేయరు. కేవలం నాగార్జున తక్కువ వోటింగ్ రావడంతోనే ఎలిమినేట్ అయ్యారు అంటూ కంటెస్టెంట్లను బయటకు పంపిస్తూ ఉంటారు.
ఈ విషయం గురించి శివాజీ మాట్లాడుతూ.. ఓటింగ్ అనేది కీలకం అయినప్పుడు అది డిస్ప్లే చేయండి. అప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయో తెలుస్తుంది. ఈ విషయంపై కంటెస్టెంట్లు ప్రేక్షకులు తేల్చుకుంటారు అంటూ ఈయన మాట్లాడారు. బిగ్ బాస్ విన్నర్ కు ఎక్కువగా ఓట్లు వచ్చాయని నిర్వాహకులు చెబితే తప్ప మనకు తెలియదు ఓటింగ్ గురించి ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు అంటూ ఈ సందర్భంగా శివాజీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కొందరి వలన ఎందరికో అన్నం పెట్టిన నాగార్జున గారికి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఆయన వలనే షో బ్రతికింది. నన్ను తొక్కేసి ఒకరిని షోలో లేపారు. ఉద్దేశపూర్వకంగానే నన్ను నెగిటివ్ గా చూపించారు అంటూ శివాజీ (Sivaji) మరోసారి ఈ కార్యక్రమం గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.