బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో నటుడు శివాజీ ఒకరు. ఈయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శివాజీ మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈయన బిగ్ బాస్ వెళ్లకముందే 90 sఅనే ఒక వెబ్ సిరీస్ లో నటించిన సంగతి మనకు తెలిసిందే. బిగ్ బాస్ నుంచి శివాజీ బయటకు వచ్చిన తర్వాత ఈ సిరీస్ విడుదల చేశారు.
అయితే ఈ వెబ్ సిరీస్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా సక్సెస్ కావడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు శివాజీ ఓటీటీల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత కాలంలో ఓటీటీలు థ్రిల్లర్ సినిమాల వెంట పరిగెడుతున్నాయని అలా వెళ్లడం మానుకోవాలని ఈయన చెప్పారు.
కుటుంబమంతా కలిసి సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా వినోదాత్మకంగా ఉండాలని అయితే ప్రస్తుతం అలాంటి సినిమాలు రావడం లేదని టీవీ ఆన్ చేయగానే మర్డర్ సినిమాలే వస్తున్నాయి అంటూ ఈయన వెల్లడించారు. ఓటీటీలలో ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని అయితే ఇలాంటివి కాకుండా ఎంటర్టైన్మెంట్ సినిమాలను కూడా అందించాలని తెలియజేశారు.
థ్రిల్లర్‌లు తీయడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ మన లైఫ్‌ను స్క్రీన్‌పై చూపించడం పెద్ద విషయం. అవే ఆడియన్స్‌కి బాగా నచ్చుతాయనీ, అందుకే వాటికి మంచి ఆదరణ వస్తోంది అంటూ ఈ సందర్భంగా (Sivaji) శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.