బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి వారిలో నటుడు శివాజీ ఒకరు ఈయన ఈ కార్యక్రమంలో గ్రాండ్ ఫినాలే వరకు ఉండి టాప్ త్రీ కంటెంట్ గా బయటకు వచ్చారు. ఇలా బయటకు వచ్చినటువంటి శివాజీ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో కూడా ఈయన రాజకీయాల పరంగా ఒక పార్టీకి మద్దతు తెలిపిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే మరోసారి మీరు రాజకీయాలలోకి రాబోతున్నారా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నేను రాజకీయాలలోకి వెళ్లడం లేదని నా పిల్లలు నన్ను సినిమాలలోనే చూడాలనుకుంటున్నారని అందుకే ఇండస్ట్రీలోనే కొనసాగుతానని తెలిపారు. రాజకీయాలలోకి వెళ్లాలి అంటే అన్ని నిజాలే మాట్లాడాలి నేను అలా మాట్లాడితే చాలామందికి నచ్చదు. నేను రాజకీయాలకు పనికిరాని అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని తెలిపారు.
నేను జగన్ కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఎవరికీ మద్దతు తెలపనని అలా కాదని నన్ను రాజకీయాలలోకి లాగాలని చూస్తే మాత్రం అదే పార్టీలోకి వెళ్లి వారి దూల తీరుస్తాను అంటూ శివాజీ రాజకీయాల గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ప్రస్తుతం నాకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని కేవలం సినిమాలపై మాత్రమే తాను దృష్టి సారించాను అంటూ శివాజీ (Sivaji) వెల్లడించారు.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!