Bigg Boss: బిగ్ బాస్ కి తిక్కరేగింది..! హౌస్ మేట్స్ లెక్క మారింది..!

బిగ్ బాస్ రియాలిటీ షోలో ఈసారి సీజన్ లో పార్టిసిపెంట్స్ చేష్టలకి విసిగిపోయాడు బిగ్ బాస్. దీంతో టాలీవుడ్ సినిమా క్యారెక్టర్స్ టాస్క్ ని రద్దు చేశాడు. టాస్క్ లో ఎవరి క్యారెక్టర్స్ లో వాళ్లు ఉండకుండా మద్యలో అందరూ ఎవరికి వారు ముచ్చట్లు పెట్టుకున్నారు. శ్రీహాన్ – ఫైమా స్కిట్ చేస్తుంటే మిగతా వాళ్లు గార్డెన్ ఏరియాలో కూర్చుని టాస్క్ గురించి లెక్కలు వేశారు. దీంతో బిగ్ బాస్ కి తిక్కరేగింది. అందర్నీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి మరీ రేవెట్టేశాడు.

ఏ సీజన్ లో కూడా ఇంత చప్పగా, నిర్లక్ష్యంగా టాస్క్ ఆడలేదని, ఈ టాస్క్ ఇచ్చిన ప్రతిసారి హౌస్ మేట్స్ ఎంతో చక్కగా పెర్ఫామ్ చేశారని బిగ్ బాస్ చెప్పాడు. మీకు టాస్క్ ల పట్ల నిర్లక్ష్యం, బిగ్ బాస్ ఆదేశాల పట్ల నిర్లక్ష్యం , ప్రేక్షకులకి వినోదం పంచడం లో కూడా నిర్లక్ష్యం అంటూ క్లాస్ పీకాడు. అందుకే , తక్షణమే మీ కాస్ట్యూమ్స్ అన్నీ తీసేసి స్టోర్ రూమ్ లో పెట్టమని అన్నాడు.

దీంతో హౌస్ మేట్స్ మోకాళ్ల మీద పడి మరీ బిగ్ బాస్ ని బ్రతిమిలాడారు. కానీ బిగ్ బాస్ కనికరించలేదు. ఇంకో విషయం ఏంటంటే., బిగ్ బాస్ ఈ టాస్క్ ని రద్దు చేసిన తర్వాత బిగ్ బాస్ ఇంట్లోకి దొంగలు వచ్చారు. దీంతో వాళ్లు దాచుకున్న ఫుడ్ ని మొత్తం దోచుకుని వెళ్లిపోయారు. హౌస్ మేట్స్ చూస్తుండగానే దొంగలు అన్నీ తీసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు హౌస్ మేట్స్ ఆహారం కోసం పోటీ పడాల్సి వస్తుంది. నిజానికి అంతకుముందు పోస్టర్స్ అంటించే ఛాలెంజ్ లో పాల్గొన్న రెండు టీమ్స్ పోటా పోటీగా ఆడాయి.

ఇక్కడ సంచాలక్ గా ఉన్న ఇనయని చాలా లైట్ తీసుకున్నారు హౌస్ మేట్స్. అంతేకాదు, ఒకరి పోస్టర్ పై మరో పోస్టర్ ని అంటిస్తూ గేమ్ ని టఫ్ చేసుకున్నారు. ఇక్కడే పోరా పప్పుగా అన్నందుకు అర్జున్ ఫీల్ అయ్యాడు. అంతేకాదు, శ్రీసత్య ఇచ్చిన మోటివేషన్ తో రేవంత్ తో గొడవకి దిగాడు. దీంతో వీళ్లిద్దరూ కాసేపు ఘర్షణ పడ్డారు. రేవంత్ అర్జున్ కి క్లాస్ పీకాడు. ఇది నీకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఫస్ట్ నుంచే చెప్పాలని అన్నాడు.

అంతేకాదు, ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తూ అరేయ్ అనే మాట్లాడాడు. కానీ, అర్జున్ మాత్రం రేవంత్ కి క్లాస్ పీకాడు. ఇక్కడే నువ్వు వద్దు నీ ప్రెండ్షిప్ వద్దురా బాబు అంటూ మాట్లాడాడు రేవంత్. వీరిద్దరి గొడవ ప్రెండ్షిప్ ని విడదీసింది. దీంతో క్యారెక్టర్స్ మర్చిపోయి మరీ హౌస్ మేట్స్ ముచ్చట్లు పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే, బిగ్ బాస్ ఈ టాస్క్ ని రద్దు చేసి ఈవారం కెప్టెన్ ఎవరూ ఉండరని తేల్చి చెప్పేశాడు. మొత్తానికి ఈసీజన్ లో హౌస్ మేట్స్ ఫస్ట్ టైమ్ ఒక టాస్క్ ని రద్దు చేశారనే చెప్పాలి. అదీ మేటర్.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus