రెచ్చిపోతున్న రేవంత్..! హౌస్ మేట్స్ అందుకే ఫీల్ అవుతున్నారు..!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ రేవంత్ తన అధికారాన్ని మరోసారి చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మార్నింగ్ కిచెన్ లో రైస్ కోసం పెద్ద లొల్లి అయ్యింది. 4 గ్లాసుల బియ్యం సరిపోతాయని కెప్టెన్ రేవంత్ చెప్తుంటే మిగతా వాళ్లు 5 గ్లాసులు పెట్టు సరిపోకపోతే ఆకలితో ఉండటం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. ఫైమా అయితే డైరెక్ట్ గా రేవంత్ కి చెప్పింది. తన కెప్టెన్సీలో కూడా అలాగే చేశామ్ అని, ఇప్పుడు కూడా అలాగే చేసి ఐదు గ్లాసుల రైస్ పెట్టమని అడిగింది. ఇక్కడే శ్రీహాన్ కూడా తన అసహనాన్ని ప్రదర్శించాడు.

నీ కెప్టెన్సీ బాగుందని లాస్ట్ లో అనిపించుకోచ్చు కానీ, హౌస్ మేట్స్ ఆకలితో ఉంటారని రేవంత్ పై అరిచాడు. ఇక్కడే శ్రీహాన్ రేవంత్ కి అర్ధమయ్యేలా చెప్తూనే రెచ్చిపోయాడు. దీంతో కాసేపు రేవంత్ ఆలోచనలో పడ్డాడు. ఇఖ మరోవైపు కీర్తి ఇంకా ఇనాయా ఇద్దరూ కూడా రేవంత్ కెప్టెన్సీలో ఫుడ్ గురించి మాట్లాడుకున్నారు. రేవంత్ అధికారం చూపిస్తున్నాడని కీర్తి చెప్తే, ఇనాయా ఫుడ్ సరిగ్గా రావట్లేదని తన అసహనాన్ని ప్రదర్శించింది.

తర్వాత హౌస్ మేట్స్ అయిన కీర్తి పొటాటో గురించి అడిగింది. దీంతో రేవంత్ పొటాటోలు సరిపోవట్లేదని చిన్న చిన్నవి ఇచ్చాడు. ఇక్కడ ఇద్దరికీ కాసేపు ఆర్గ్యూమెంట్ అయ్యింది. దీంతో నాకు అక్కర్లేదని కీర్తి వెళ్లిపోయింది. హౌస్ లో రేవంత్ కెప్టెన్ గా, రేషన్ మేనేజర్ గా ఉండటమే హౌస్ మేట్స్ కి కష్టంగా ఉంది. ఇనాయా అయితే, అస్సలు ఫుడ్ తినబుద్ది కావట్లేదని చెప్పింది. ఇక రేవంత్ మాత్రం రేషన్ అనేది వారం రోజులు సరిపోవడానికి ఖచ్చితంగా కొలతలతోనే వండాలని, లేదంటే మాత్రం సరిపోదని ఖచ్చితంగా చెప్తూ వితండవాదం చేశాడు.

శ్రీహాన్ గట్టిగా క్లాస్ పీకడంతో మళ్లీ లైన్లోకి వచ్చాడు రేవంత్. కానీ, మరోసారి బంగాళదుంపలకోసం కీర్తి లొల్లిచేసింది. ఇలా రేవంత్ కెప్టెన్సీలో ఫుడ్ సరిపోవట్లేదని హౌస్ మేట్స్ తమ అహసనాన్ని ప్రదర్శించారు. అంతేకాదు, ఆదిరెడ్డి కూడా ఫైమా కెప్టెన్సీలో ఎన్ని కప్పులు రైస్ పెడుతున్నావ్ అని అడిగాడు. దీనికి ఆమె రైస్ సరిపోకపోతే అడిగితే వాళ్లు పంపిస్తున్నారని క్లియర్ గా చెప్పింది. ఆ తర్వాత హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ, ఇంకా మిగతా హౌస్ మేట్స్ ని ఆడియన్స్ అడిగే ప్రశ్నలతో ఎపిసోడ్ ముగిసింది. అదీ మేటర్.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus