Bigg Boss Telugu 6: ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో ఉన్నది వీళ్లేనా..! ఏం జరుగుతోంది ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి నామినేషన్స్ పెట్టాడు బిగ్ బాస్. క్లాస్ , మాస్, ట్రాష్ అంటూ మూడు తరగతులు విభజించి వారిలో ట్రాష్ లో ఉండే సభ్యులు నేరుగా నామినేట్ అవుతారని చెప్పాడు. దీంతో ట్రాష్ నుంచీ వారి తరగతిని మార్చుకునేందుకు ఇంటి సభ్యులు ఛాలెంజస్ ఆడుతున్నారు. ఫస్ట్ ఛాలెంజ్ లో మాస్ నుంచీ ఆదిరెడ్డి, ట్రాష్ నుంచీ ఇనయా సుల్తానా పోటీ పడితే ఆదిరెడ్డి క్లాస్ లోకి వెళ్లాడు. శ్రీహాన్ మాస్ లోకి వచ్చాడు. ఆ తర్వాత జరిగిన బిగ్ స్విచ్ టాస్క్ లో గలాటే గీతు ట్రాష్ నుంచీ ఏకంగా క్లాస్ లోకి జంప్ అయ్యింది.

క్లాస్ లో ఉన్న బాలాదిత్య ట్రాష్ లోకి వచ్చాడు. ఇక్కడే బిగ్ బాస్ ట్రాష్ లో ఉన్నవారికి మరో అవకాశం ఇచ్చాడు. స్లైడర్ గేమ్ లో ట్రాష్ నుంచీ రేవంత్, మాస్ నుంచీ అభినయశ్రీ పోటీ పడ్డారు. ఇందులో రేవంత్ విజయం సాధించి మాస్ లోకి అడుగుపెట్టాడు. దీంతో పోటీలో ఓడిపోయింది కాబట్టి అభినయశ్రీ మాస్ నుంచీ ట్రాష్ కి వచ్చింది. నాలుగో ఛాలెంజ్ లో ఇనయా సుల్తానా మరోసారి పోటీ పడింది.

ఈసారి మాస్ నుంచీ నేహా చౌదరి , ట్రాష్ నుంచీ ఇనయ సుల్తానా ఇద్దరూ పోటీకి దిగారు. రోల్ బేబీ రోల్ ఛాలెంజ్ లో సుల్తానా ఓడిపోయింది. దీంతో నేహా చౌదరి క్లాస్ లోకి వెళ్లగా, అక్కడున్న ఆర్జే సూర్య మాస్ లోకి రావాల్సి వచ్చింది. ఇక ట్రాష్ లో మిగిలిన వాళ్లు నేరుగా నామినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇనయా సుల్తానా, బాలాదిత్య, ఇంకా అభినయశ్రీలు నామినేట్ అయ్యే అవకాశం ఉంది. వీరితో పాటుగా మాస్ లో ఉన్న మరికొంతమంది నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరి బిగ్ బాస్ మాస్ లో ఉన్నవారిని ఎలా నామినేట్ చేయబోతున్నాడు అనేది ఆసక్తికరం. ఇక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తే మాత్రం హౌస్ మేట్స్ కి గేమ్ లో ఎలా ముందుకు వెళ్లాలో కూడా అర్ధం కాదు. నిజానికి సోమవారమే డిసైడ్ అవ్వాల్సిన నామినేషన్స్ ఇప్పుడు బుధవారం వరకూ జరుగుతున్నాయి. దీంతో హౌస్ మేట్స్ కి ఓటింగ్ చేసేవారికి కేవలం రెండు రోజులు మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతానికి ముగ్గురు నామినేషన్స్ లో కన్ఫార్మ్ అయినట్లే. మరి మిగతా మాస్ టీమ్ లో నుంచీ ఎంతమంది నామినేట్ అవుతారు అనేది చూడాలి. అదీ మేటర్.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus