Bigg Boss Telugu 6: బిగ్ బాస్ విన్నర్ ఎవరో ముందుగానే తెలిసిపోయింది..! కావాలనే లీక్ చేశారా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ – 6 విన్నర్ ఎవరో సోషల్ మీడియాలో ముందుగానే తెలిసిపోయింది. అన్ అఫీషియల్ ఓటింగ్ లెక్కలు చూస్తుంటే టాప్ లో ఉన్నవాళ్లకే పట్టం కట్టేలా కనిపిస్తోంది బిగ్ బాస్ టీమ్. ప్రస్తుతం ఓటింగ్ లో టాప్ లో రేవంత్ ఒక్కడే కనిపిస్తున్నాడు. దాదాపుగా 30శాతం ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. ఇక రెండో ప్లేస్ లో 17శాతం ఓటింగ్ తో శ్రీహాన్ ఉన్నాడు. వీరిద్దరికీ 13శాతం ఓటింగ్ వరకూ తేడా ఉంది. ఒక్కరోజులో ఇంత హ్యూజ్ గా అయితే ఓట్లు పడే ఛాన్స్ లేదు.

కాబట్టి రేవంత్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఫస్ట్ వీక్ నుంచీ చూసినట్లయితే రేవంత్ కి నిలకడగానే ఓటింగ్ అనేది వస్తోంది. వరుసగా నామినేషన్స్ లోకి వచ్చినా కూడా సేఫ్ అవుతూ ఫినాలే వరకూ వచ్చాడు. 20 నుంచీ 30 శాతం లోపు ఓటింగ్ ని ప్రతి వారం కూడా ప్రభావితం చేశాడు. అయితే, మద్యలో ఇనయా సుల్తానా అనూహ్యంగా ఓటింగ్ లో టాప్ లోకి వచ్చింది. కానీ, చివరి వారంలో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. దీంతో రేవంత్ కి పోటీ లేకుండా పోయింది.

ఫినాలే వరకూ ఇనయా వచ్చి ఉంటే రేవంత్ కి గట్టి పోటీ ఇచ్చి ఉండేదేమో. కానీ, శ్రీహాన్ – రోహిత్ – ఆదిరెడ్డి వీళ్లు ఎవరూ కూడా రేవంత్ ఓటింగ్ ముందు నిలవలేకపోయారు. అఫీషియల్ ఓటింగ్ లెక్కల్లో రోహిత్ ఆదిరెడ్డికి బాగా ఓటింగ్ జరుగుతోందని టాక్ వచ్చింది కానీ, అందులో అంత నిజం లేదని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. ఇక అన్ అఫీషియల్ లెక్కలు చేూస్తుంటే మాత్రం రేవంత్ పక్కా విన్నర్ అయిపోతాడని బల్లగుద్ది మరీ చెప్తున్నారు.

చివర్లో రేవంత్ కి ఇంకా శ్రీహాన్ కి ఇద్దరి మద్యలోనే పోటీ ఉంటుందని, రేవంత్ విన్నర్ అవుతాడని చెప్తున్నారు. ఓటింగ్ లో రోహిత్ కి 15శాతం , కీర్తికి 14శాతం ఆదిరెడ్డికి 15శాతం శ్రీసత్యకి 9శాతం ఓటింగ్ అనేది జరుగుతోంది. వీళ్లు అసలు రేస్ లోనే లేకుండా పోయారు. ఇక శ్రీసత్యకి అందరికంటే తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది ఈసారి అయ్యింది. దీంతో మిడ్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. రేవంత్ విన్నర్ అవుతాడని ఫస్ట్ వీక్ నుంచీ కూడా ఫ్యాన్స్ ఆశగానే చూస్తున్నారు.

అనుకున్నట్లుగానే ఇప్పుడు ట్రోఫీని సంపాదించేలాగానే కనిపిస్తున్నాడు. ఈవిషయాన్ని బిగ్ బాస్ టీమ్ ఇనయాని ఎలిమినేట్ చేసినప్పుడే చెప్పకనే చెప్పిందని చాలామంది కామెంట్స్ కూడా చేశారు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో రేవంతే విన్నర్ అని కావాలనే బిగ్ బాస్ టీమ్ లీక్ చేసిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి సీజన్ లో గ్రాండ్ ఫినాలేకి అంత కిక్ లేదనే చెప్పాలి. అదీ మేటర్.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus