Nagarjuna, Balayya Babu: బాలయ్య అన్ స్టాపబుల్ ముందు ‘బిగ్ బాస్-6’ నిలుస్తుందా?

నందమూరి బాలకృష్ణ.. ‘అఖండ’ విజయంతో మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న బాలయ్య… మరోపక్క హోస్ట్‌ గా కూడా ‘అన్ స్టాపబుల్ సీజన్2’ కోసం కూడా రెడీ అవుతున్నాడు.అతి త్వరలో ఈ షో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ సీజన్ ఎంతలా సూపర్ సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో స్టార్ట్ అయ్యే ముందు ఎన్నో అనుమానాలు, ఎన్నో ట్రోల్స్ వచ్చాయి.

‘బాలయ్య ఏంటి? టాక్ షో చేయడం ఏంటి? మామూలుగానే ఆయన మాట్లాడటానికి చాలా కష్టపడుతుంటారు. ఏదో మాట్లాడాలని మొదలుపెట్టి.. ఇంకెక్కడికో దానిని తీసుకెళ్లి.. ఇంకెక్కడో ముగిస్తూ ఉంటారు’ అలాంటి బాలయ్య టాక్ షో చేయడం ఏంటి అంటూ.. ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ బాలయ్య వీటన్నిటినీ పటాపంచలు చేశాడు. ఆహా వారు నిర్వహించిన ఈ అన్‌ స్టాబుల్‌ షో ఇండియా వైడ్ టాప్ షోగా రికార్డులు సృష్టించింది. ఇక సీజన్ 2 కూడా అదే రేంజ్ లో ఉంటుంది అని అంతా భావిస్తున్నారు.

‘మధుర క్షణాలకు ముగింపు ఉండదు కొనసాగింపే’ అంటూ బాలయ్య రెట్టింపు జోష్ తో ఈ షోని హోస్ట్ చేయబోతున్నాడు. అయితే ‘బిగ్ బాస్ 6’ కూడా సెప్టెంబర్ ఆరంభంలో ప్రారంభం కానుంది. ఈ షోకి కూడా భారీ క్రేజ్ ఉంది అన్న సంగతి తెలిసిందే. గత 5 సీజన్లు కూడా సూపర్ సక్సెస్ సాధించాయి.

నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 6’ పై బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్2’ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే దానికి దీనికి సంబంధమే లేదు. అన్ స్టాపబుల్ వారంలో ఒక్కరోజు మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus