పాన్ ఇండియా సినిమాలో బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కౌశల్ అప్పటివరకు పలు సినిమాలు సీరియల్స్ లో నటించే ప్రేక్షకులను సందడి చేశారు. అయితే బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నటువంటి ఈయన సీజన్ 2 విజేతగా నిలిచి బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో ఈయన కొనసాగే సమయంలో కౌశల్ ఆర్మీ అంటూ ఈయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.

ఇక ఈ కార్యక్రమంలో ఈయన విజేతగా నిలబడటంతో చాలామంది ఇక ఈయన లైఫ్ టర్న్ అయిందని ఈయనకు పెద్ద ఎత్తున సినిమాలలో అవకాశాలు వస్తాయని అందరూ భావించారు అయితే ఉన్నఫలంగా కౌశల్ తెరపై కనిపించకుండా మాయమయ్యారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కౌశల్ పలు విషయాలను వెల్లడించారు. బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగే సమయంలో తనని ఎంతోమంది అభిమానులు సపోర్ట్ చేశారు.

అందుకే ఈ కార్యక్రమం పూర్తి కాగానే అభిమానులందరినీ కలవడానికి వెళ్లానని ఇలా అభిమానులతోనే సుమారు 8 నెలలపాటు సమయం గడిపానని తెలిపారు. అనంతరం కొన్ని సినిమా కథలను విన్నాను అంతలోపే కరోనా రావడంతో తన కెరీర్ కు బ్రేక్ పడిందని కౌశల్ తెలిపారు. ఇక ప్రస్తుతం తాను ఒక రెండు సినిమాలలో చేశానని అయితే అవి కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయని (Kaushal) ఈయన తెలియజేశారు.

ఇక త్వరలోనే మరో పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ఉన్నారని తాను కూడా ఒక కీలకపాత్రలో నటించబోతున్నానంటూ ఈయన వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలన్నీ అధికారిక ప్రకటన చేయబోతున్నామని తెలిపారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus