Chiranjeevi: చిరు ఎంతమందితో అని సినిమా చేస్తారు..!

ఏడాది కాకుండానే మూడు సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరోగా చిరు రికార్డు సృష్టించారు. ఇందులో ఆచార్య ఫలితం తేడా కొట్టినా ‘గాడ్ ఫాదర్’ ఓకే అనిపించుకుంది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రస్తుతం చిరు ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇది ‘వేదాళం’ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఇది పూర్తయ్యాక చిరు చేయబోయే ప్రాజెక్టు ఏంటి అనే విషయం పై ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ చిరు మాత్రం వరుసగా కథలు వింటున్నారు. ఏమాత్రం ఖాళీగా ఉండటం లేదు. ఒకేసారి రెండు, మూడు ప్రాజెక్టులు అనౌన్స్ చేయాలనేది చిరు తాపత్రయం. బివిఎస్ రవి చెప్పిన కథని చిరు ఓకే చేశారు. దీనికి వేరే దర్శకుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నారు చిరు. మరోపక్క గోపీచంద్ మలినేని, కళ్యాణ్ కృష్ణ కురసాల వంటి దర్శకులు చెప్పిన కథలు విన్నారు.

ఇంకా వింటూనే ఉన్నారు. ఇదే క్రమంలో ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ చెప్పిన కథ కూడా విన్నారు. అలాగే ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వశిష్ట్ చెప్పిన కథ కూడా విన్నారు. కానీ ఏది ఫైనల్ చేయలేదు. అయితే మల్లిడి వశిష్ట్ చెప్పిన కథకి ఓకే చెప్పేసినట్టు ప్రచారం మొదలైంది. అందులో నిజం లేదు. మధ్యలో అతను ‘బింబిసార 2 ‘ పూర్తిచేయాలి. అది రిలీజ్ అయ్యి, హిట్ అయితే కానీ పెద్ద హీరోలు ఇతనితో సినిమాలు చేయడానికి ఇంకా ముందుకు రాకపోవచ్చు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus