Bimbisara Collections: 10 వ రోజు కూడా కోటి పైనే షేర్ ను కలెక్ట్ చేసిన బింబిసార…!

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ‘బింబిసార’. సోసియో ఫాంటసీ, టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. సంయుక్త మీనన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ తన బావమరిది హరికృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పై నిర్మించాడు.

టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని అందరిలోనూ కలిగించాయి. అందుకు తగ్గట్టే మొదటి రోజు ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక వీక్ డేస్ లో కూడా సూపర్ గా కలెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి వారమే బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సాధించడం విశేషం.

రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ బాగా క్యాష్ చేసుకుంటుంది. నిన్న 10వ రోజు కూడా ఈ మూవీ కోటి పైనే షేర్ ను కలెక్ట్ చేసింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 9.16 cr
సీడెడ్ 5.93 cr
ఉత్తరాంధ్ర 3.87 cr
ఈస్ట్ 1.57 cr
వెస్ట్ 1.19 cr
గుంటూరు 1.85 cr
కృష్ణా 1.37 cr
నెల్లూరు 0.77 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 25.71 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.68 cr
ఓవర్సీస్ 2.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 29.41 cr

‘బింబిసార’ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.29.41 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయడమే కాకుండా ఇప్పటివరకు బయ్యర్లకు రూ.13.41 కోట్ల లాభాలను అందించింది ఈ మూవీ.

కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ‘బింబిసార’. ఆల్రెడీ రూ.29 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించిన ఈరోజుతో ఫుల్ రూ.30 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయి!

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus