కథ డిమాండ్ చేస్తే నగ్నంగా కూడా నటిస్తా : బిందు మాధవి

  • August 2, 2019 / 06:11 AM IST

‘కథ డిమాండ్ చేయాలే కానీ నగ్నంగా నటించడానికి కూడా నేను రెడీ’ అంటుంది హీరోయిన్ బిందుమాధవి. అప్పట్లో స్టార్ హీరోయిన్లుగా రాణించిన కొంతమంది ఇప్పుడు.. కుర్ర హీరోయిన్ల పోటీని తట్టుకోవడాని కథా ప్రాధాన్యత… అందులోనూ వారి పాత్రలకి ప్రాధాన్యత ఉండే సినిమాలని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ సినిమా హిట్టయితే పేరుతో పాటు మరిన్ని ఆఫర్లు వస్తాయి. అలాగే దర్శక నిర్మాతలు అడిగినంత పారితోషికాన్ని కూడా ఇస్తుంటారు. అప్పట్లో శారద, విజయశాంతి లాంటి వారు ఈ ట్రెండ్ ను మొదలుపెట్టారు.

ప్రస్తుతం అనుష్క, నయనతార, త్రిష, జ్యోతిక వంటి వారు ఎక్కువగా ఇలాంటి చిత్రాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా అమలాపాల్‌ కూడా ఈ లిస్ట్ లో చేరింది. ఇటీవల ‘ఆడై’ చిత్రంలో నటించింది. అందరికంటే ఒకడుగు ముందుకేసి.. కథ డిమాండ్ చేసిన ప్రకారం నగ్నంగా నటించి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు బిందుమాధవి కూడ అలాంటి పాత్రలు చేయడానికి సిద్దమంటుంది. ‘ఆవకాయ్ బిర్యానీ’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన బిందు మాధవి.. ఆ తరువాత ‘బంపర్ ఆఫర్’ ‘పిల్ల జమిందార్’ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తరువాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తుంది. మధ్యలో ఈమె బిగ్‌బాస్‌-1 గేమ్‌షోలో కూడా పాల్గొని కొంచెం క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం బిందుమాధవి…. కృష్ణ శేఖర్ హీరోగా నటిస్తున్న ‘కళుగు-2’ లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఆగస్టు 2న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

1

2

3

4

5

6

7

8

9

10

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus