బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ అనేది చాలా ఆసక్తికరంగా జరిగింది. ఒక రింగ్ లో అందరూ ఉండి వారి జెండాలని కలక్ట్ చేసి వారికి కేటాయించిన ప్లేస్ లో పెట్టాలి. మహేష్ విట్టా ఈ టాస్క్ లో సంచాలక్ గా ఉన్నాడు. ఇక్కడే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో అఖిల్ అండ్ టీమ్ నుంచీ ముగ్గురు, బిందు అండ్ టీమ్ నుంచీ ఇద్దరూ ఇంకా జడ్జిగా ముమైత్ ఖాన్ పార్టిసిపేట్ చేశారు. అఖిల్ అండ్ టీమ్ నుంచీ అజయ్, స్రవంతి వస్తే, బిందు టీమ్ నుంచీ బిందు, ఇంకా శివ వచ్చారు.
ఇక్కడే ఫస్ట్ రౌండ్ లోనే బిందుని అవుట్ చేసేశారు. కొద్దిగా సేపు పోరాడిన బిందు టాస్క్ లో గెలవలేకపోయింది. ముమైత్ ఖాన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఇప్పుడు హౌస్ ని హీటెక్కిస్తోంది. ముందుగా మహేష్ విట్టా ముమైత్ ఇచ్చిన తీర్పుని తప్పుబట్టాడు. కొన్ని పాయింట్స్ లో తీర్పు కరెక్ట్ గా సిట్యువేషన్ కి తగ్గట్లుగా ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, అఖిల్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టే తీర్పు అటువైపు ఇస్తావని ముందుగానే గ్రహించానని చెప్పాడు. అయితే, ఇప్పుడు ముమైత్ ఖాన్ బయట నుంచీ ఇంట్లోకి వచ్చింది.
అంతేకాదు, గేమ్ ఎలా ఆడాలి అనేది కొన్ని బిగ్ బాస్ టీమ్ నుంచీ ఇన్ పుట్స్ తీసుకునే వచ్చి ఉంటుంది. అలాగే, బయట ఓటింగ్ అనేది ఎలా జరుగుతోంది. ఎవరు అఖిల్ కి పోటీగా ఉన్నారు అనేది కూడా ఖచ్చితంగా తెలిసే వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఇప్పుడు బయట జరిగే ఓటింగ్ గురించి ఖచ్చితంగా అఖిల్ చెవిలో వేస్తుంది. బిందు, ఇంకా శివ ఇద్దరూ కూడా నీకు పోటీగా వస్తున్నారని చెప్తుంది. దీంతో గేమ్ పూర్తిగా మారిపోతుంది.
ఇప్పటికే కోర్టు టాస్క్ లో బిందుని టార్గెట్ చేసిన అఖిల్ మిత్రబృందం ఈ ఇన్ పుట్స్ తీసుకుని చెలరేగిపోతారు. అసలు బిందు ఏం గేమ్ ఆడుతోందని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అలాగే నామినేషన్స్ అప్పుడు కూడా మాటకి మాట చెప్తూ లాజికల్ గా బిందు రాంగ్ గేమ్ ఆడుతోందని ప్రూవ్ చేసేంందుకు చూస్తారు. టార్గెట్ బిందు, ఆపరేషన్ బిందు అనేది ఈవారం నుంచే మొదలైపోతుంది.మరోవైపు హౌస్ లో బిందుకి సపోర్టింగ్ గా శివ నిలుస్తున్నాడు. కాబట్టి శివని కూడా టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
అలాగే, మహేష్ విట్టా , హమీదాలు కూడా మెల్లగా బిందువైపు వస్తున్నారు. ఈసారి నామినేషన్స్ ఖచ్చితంగా హీటెక్కడం ఖాయం. అలాగే ముమైత్ ఖాన్ జడ్జిమెంట్ ని కూడా తప్పుబట్టి మరీ నామినేట్ చేస్తారు. కెప్టెన్సీ పోటీదారులు అయినా, అవ్వకపోయినా ముమైత్ ఖాన్ ఫేవరెటిజం చూపించిందనే రీజన్స్ చెప్తారు. అలాగే, బిందుని కూడా ఈ పాయింట్స్ లో ఖచ్చితంగా నామినేషన్స్ లోకి తీస్కుని వస్తారు. మొత్తానికి అదీ మేటర్.