Bindu, Nataraj: వాష్ రూమ్ మేటర్ తెచ్చిన మాస్టర్..! కారణం ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ వేడి చల్లారింది. ఇల్లంతా సెగ కమ్మిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. అయితే, నటరాజ్ మాస్టర్ మాత్రం ఛాన్స్ దొరికినప్పుడల్లా మాటలు విసురుతూనే కనిపిస్తున్నారు. కిచెన్ లో వర్క్ చేసేటపుడు బిందు డిషెష్ తోమలేదని బాబాకి కంప్లైట్ చేశాడు. అంతేకాదు, సీక్రెట్ రూమ్ లో గేమ్ చూసి వచ్చి ఆమెని సేఫ్ చేశావ్ కదా, నువ్వే చెప్పు అంటూ కొద్దిగా అసహనంగానే మాట్లాడారు. అస్సలు పనేం చేయట్లేదు, బెడ్ పైన కాళ్లు ఊపుతూ కూర్చుంటుంది అంటూ మరోసారి బిందు గేమ్ ని తప్పు బట్టే ప్రయత్నం చేశారు.

అలాగే, అక్కడికి వచ్చిన శివతో కూడా కొద్దిగా ఆర్గ్యూమెంట్ చేశారు. నీకు నోరు బాగా దురద అంటూ చెప్పాడు. అందుకే, బటన్స్ విప్పు అంటూ మాట్లాడావ్ అని శివ వీక్ పాయింట్ పైన కొట్టాడు. మరోసారి వాష్ రూమ్ మేటర్ ని తీస్కుని వచ్చాడు. గతంలో అషూరెడ్డితో మాట్లాడేటపుడు శివ బటన్స్ తీసేయ్ అంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇది లేడీ గెటప్ వేసేందుకు తనకి ఇన్నర్స్ కావాలని, ఎలాంటివి కావాలో చూపించేందుకు అలా శివ మాట్లాడాడు అని హౌస్ లో అందరికీ తెలుసు. ఉద్దేశ్య పూర్వకంగా అలా అనలేదని కూడా తెలుసు. కానీ, ఇప్పుడు మరోసారి మాస్టర్ శివని ఇదే పాయింట్ పైన ట్రిగ్గర్ చేశారు.

అంతేకాదు, ఛాన్స్ దొరికినప్పుడల్లా శివ – బిందు ల గేమ్ రాంగ్ అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని వారాలు అయిన తర్వాత శివ – బిందు ఇద్దరూ ఆటలో ముందుకు వెళ్లడం అనేది నటరాజ్ మాస్టర్ కి ఇష్టం లేదు. అసలు ఆడియన్స్ ఇవేమీ చూడటం లేదా ? ఎందుకు వీళ్లు సేఫ్ అవుతున్నారు ? పైగా టాప్ – 5 కి కూడా వెళ్తున్నారు అనే భావనలో మాస్టర్ ఉన్నారు. ఇదే పాయింట్ డైరెక్ట్ గా నామినేషన్స్ అప్పుడు కెమెరా వైపు తిరిగి ఆడియన్స్ ని ఉద్దేశ్యించి చెప్పారు కూడా.

నిజానికి వీళ్లిద్దరి పై మాస్టర్ కి ఎందుకంత పగ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పటి నుంచీ అఖిల్ ఇంకా నటరాజ్ మాస్టర్, అనిల్ ల గేమ్ పూర్తిగా మారిపోయింది. అనిల్ బిందు – శివలతో మరింత బాగా ఎక్కువగా కలిసిపోయాడు. అఖిల్ తన గేమ్ స్టైల్ ని పూర్తిగా మార్చాడు. అలాగే, నటరాజ్ మాస్టర్ అయితే బిందులు విన్నర్ అవుతుందనే భావనలోనే ఉన్నారు. అసలు ఇలాంటి అమ్మాయికి ఓట్లు ఎలా వేస్తున్నారు ? ఎవరు గెలిపిస్తున్నారు అనేది మాస్టర్ జీర్ణించుకోలేకపోతున్నారు. హౌస్ మేట్స్ కుటుంబసభ్యులు , మిత్రులు వచ్చి టాప్ – 5లో బిందుని అందరూ పెట్టారు.

అంతేకాదు, అందరూ కూడా బిందుని నెంబర్ 2 పొజీషన్ లో పెట్టారు. దీంతో బిందు విన్నర్ అవ్వబోతోందని హౌస్ లో అందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చింది. అందుకే, ఇప్పుడు బిందుని మాస్టర్ కావాలని టార్గెట్ చేసి ఇలా మాట్లాడుతున్నారా అని అనిపిస్తోంది. అంతేకాదు, నామినేషన్స్ అప్పుడు తన మనసులో ఎంత ఉందో అంతా వెళ్లగక్కారు. ఇప్పుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా అసలు బిందు ఎలాంటి గేమ్ ఆడింది. శివ నోటి దూల ఎలా ఉంది అనేది గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, బాబాభాస్కర్ వాళ్లకి సపోర్ట్ చేయడం అనేది అస్సలు నచ్చడం లేదు. మరి ఈ వారం ఇది ఎంత దూరం వెళ్తుందనేది చూడాలి. అదీ మేటర్.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Share.