ప్రముఖ టీవీ యాంకర్ మరియు నటుడు అయిన బిత్తిరి సత్తికి కరోనా సోకిందా? అంటే అవుననే.. సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విషయం పై సత్తి కూడా క్లారిటీ ఇచ్చాడు. తను మాట్లాడుతూ…”నాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్‌లో ఉంటున్నాను. స్వల్పంగానే నాకు కరోనా లక్షణాలున్నాయి.అందుకే గత నాలుగు రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉండి డాక్టర్ల సూచనల మేరకు మెడిసిన్స్ తీసుకుంటున్నాను. కరోనా లక్షణాలతో రెండ్రోజులు మాత్రమే నిద్రపట్టకుండా కాస్త ఇబ్బందిపడ్డాను.
శ్వాస సంబంధిత సమస్య తప్ప మరే సమస్య లేదు. వీడియో కాల్ ద్వారా వైద్యుల సలహా తీసుకుంటున్నాను. ఎవరికైనా కరోనా సోకితే కంగారు పడాల్సిన పని లేదు. ఒకవేళ కరోనా వస్తుందేమో అని భయపడేవాళ్లు… దాన్ని అడ్డుకునేందుకు విశ్రాంతి తీసుకోవడం అలాగే మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది.పసుపు కలిపి వేడినీటితో ఆవిరి పట్టడం ద్వారా చాలా మేలు..! కరోనా ఉన్నా… లేకున్నా దీన్ని పాటించడానికి ప్రయత్నించండి.
కరోనా అందరికీ చెమటలు పట్టించిన సంగతి కరెక్టే.. కానీ మన దగ్గర పసుపు వంటి ఔషధాలు ఉన్నాయి…దీంతో సులభంగా దీన్ని జయించవచ్చు. కరోనా టెస్టుల్లో … పాజిటివ్ అని నిర్ధారణ అయితే…దాన్ని దాచి పెట్టడం సరికాదు.స్తోమత కొద్దీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి” అంటూ చెప్పుకొచ్చాడు బిత్తిరి సత్తి.