తమిళనాడు బీజేపీకి చెందిన కొందరు కావాలనే తన ఫోన్ నెంబర్ లీక్ చేయడంతో బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ నటుడు సిద్ధార్థ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తనకు వచ్చిన కాల్స్ అన్నీ రికార్డ్ చేశానని.. పోలీసులకు అందిస్తానని సిద్ధార్థ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తనకు వచ్చిన వేధింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేశారు. తాను చేసిన ట్వీట్ లో ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలను ట్యాగ్ చేశాడు. దీంతో తమిళనాడు బీజేపీ దీన్ని తీవ్రంగా ప్రతిఘటించింది.
సిద్ధార్థ్ తన ట్వీట్ల ద్వారా మోడీ, అమిత్ షాలను అవమానించాడంటూ తమిళనాడు బీజేపీ స్పోక్స్‌పర్సన్ నారాయణన్ తిరుపతి అన్నారు. సిద్ధార్థ్ అనే వ్యక్తి తరచూ నేరాలకు పాలపడుతుంటాడని.. గతంలో అతడిపై కేసు కూడా పెట్టానని.. ఆ కేసు ఇంకా కోర్టులో ఉందని అన్నారు. తాజాగా అతడు ప్రధాని, హోమ్ మంత్రిలను దూషించి మరో తప్పు చేశాడని.. అతడి రీసెంట్ ట్వీట్ లో యోగి ఆదిత్యనాథ్ ను కూడా దూషించాడని అన్నారు. తనకు బెదిరింపులు వస్తే.. దాన్ని చట్టపరంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలాంటి ప్రధానిని, మంత్రులను దూషించడం ఖండించదగిన చర్య అని స్పష్టం చేశారు.
దీంతో పాటు బీజేపీ తమిళనాడు ఐటీ సెల్ వింగ్ హెడ్ నిర్మల్ కుమార్ కూడా సిద్ధార్థ్ ఆరోపణలను ఖండించారు. బీజేపీ ఐటీ విభాగానికి చెందిన వ్యక్తులే తన ఫోన్ నెంబర్‌ని లీక్ చేశారని సిద్ధార్థ్ అంటున్నారని.. అందులో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. సిద్ధార్థ్ చేస్తోన్న ఆరోపణలతో తమకు సంబంధం లేదని అన్నారు. ఈ పాండమిక్ పరిస్థితుల్లో ప్రజలకు ఎలా సహాయం చేయాలనే విషయంపై దృష్టి పెట్టాలి కానీ సిద్ధార్థ్ లాంటి వ్యక్తులను పట్టించుకోకూడదని అన్నారు. అతడు కేవలం టైమ్ పాస్ చేస్తున్నారని నిర్మల్ కుమార్ ట్వీట్ చేశారు.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!