కోలీవుడ్‌లో ఆదాయపు పన్ను శాఖ ఇటీవల సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లు, కార్యాలయాల మీద ఐటీ రైడ్స్ జరిగాయి. అయితే అప్పుడు ఈ విషయమ్మీ పూర్తి సమాచారం లేకపోయినా, ఇప్పుడు కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు (CBDT) వివరాలు వెల్లడించింది. మొత్తంగా తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్ల నుండి సుమారు రూ. 200 కోట్ల నల్లధనం గుర్తించినట్లు వెల్లడించింది.
ప్రముఖ కోలీవుడ్ నిర్మాతలు కలైపులి ఎస్.థాను, అన్బుసెళియన్, ఎస్‌ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా తదితరుల కార్యాలయాల్లో ఆగస్టు 2, 3, 4 తేదీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. చెన్నై, మధురై, కొయంబత్తూరులోని మొత్తం 40 చోట్ల ఈ తనిఖీలు చేపట్టారు. లెక్కల్లో చూపించని 26 కోట్ల రూపాయల నగదు, మూడు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. దీంతో పాటు రూ.200 కోట్లకు పైగా అప్రకటిత ఆదాయాన్ని గుర్తించినట్లు CBDT తెలిపింది.
ఆదాయపు పన్ను లెక్కల్లో వెల్లడించని ఈ ఆదాయానికి సంబంధించిన కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. సినిమాల విడుదల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆయా నిర్మాతలు, పంపిణీదారులు తక్కువగా చూపించినట్లు అధికారులు గుర్తించారు. థియేటర్ల నుండి డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి ఆ మొత్తాన్ని లెక్కల్లో చూపించలేదని సీబీడీటీ అధికారులు తెలిపారు. నిర్మాత, పంపిణీదారుడు, ఫైనాన్షియర్, సినిమా హాల్స్ తదితర పలు వ్యాపారాలు చేస్తున్న అన్బుసెళియన్‌కి చెందిన సంస్థల కార్యాలయాలు… అతని బంధువులు, సన్నిహితుల నివాసాల మీద ఈ దాడులు జరిగాయట.
మధురై, చెన్నైలోని అతని కార్యాలయాలు, సినిమా థియేటరు తదితర ప్రాంతాల్లోనూ సోదాలు జరిపారు. కోలీవుడ్‌లో శరవణన్ నటించిన ‘ది లెజెండ్’ సినిమాను అన్బుసెళియన్ పంపిణీ చేసినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం అన్బుసెళియన్ ఇళ్లు, ఇతర ప్రదేశాల్లో జరిగిన సోదాల్లో ఇలానే రూ.70 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?