రక్తంతో నిండిపోతున్న తెలుగు తెరలు.. ఈ పరిస్థితి ఇంకా శ్రుతిమించితే..!

మాస్‌ సినిమాల్లో రక్తం కనిపించడం కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా మన వెండితెరలపై రక్తపు మరకలు పడుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో రక్తం ఏరులై పారుతోంది. సినిమా నిజమై ఉంటే థియేటర్లు మొత్తం రక్తం నిండిపోయి, ఎండిపోయేవి. ఎందుకంటే మాస్‌ మ్యాజిక్‌ చూపించే క్రమంలో బ్లడ్‌ బాత్‌ను పెంచేస్తున్నారు. దీంతో బ్లడ్‌ + టాలీవుడ్‌ (Tollywood) = టూమచ్‌ బ్లడ్‌, టూ బ్యాడ్‌ అయిపోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఈ పరిస్థితికి దగ్గర దగ్గరల్లో ఉంది అని చెప్పాలి.

Tollywood

దీనినే దర్శకనిర్మాతలు, హీరోలు కొనసాగిస్తే మాత్రం పైన చెప్పింది కచ్చితంగా అవుతుంది. సినిమా ఎప్ప‌టిక‌ప్పుడు రూపు రేఖ‌ల్ని మార్చుకొంటోంది, మార్చుకోవాలి కూడా. అయితే ఆ మార్పు సినిమా స్థాయిని పెంచేలా ఉండాలి తప్ప.. ఇబ్బంది పెట్టేలా కాదు. ప్రేమ కథలు, మాస్‌ కథలు, యాక్షన్‌ కథలు అంటూ కొత్తగా కొత్తగా వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మాస్‌ అనగానే రక్తం పొంగిపొర్లుతోంది. ఇక్కడ ఒకట్రెండు సినిమాల పేర్లు చెప్పడం అని కాదు కానీ..

ఎరుపు రంగు వాడకం అయితే సినిమాల్లో, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో పెరిగిపోయింది. ఇదిలా చూస్తుంటే సినిమా జోనర్లలో బ్లడ్‌ బాత్‌, బ్లడ్‌ ఫీస్ట్‌, బ్లడీ మాస్‌ లాంటివి చేరిపోతాయేమో అనిపిస్తోంది. తెలుగు సినిమాను ఏదో అనేస్తున్నాం అని కాదు కానీ.. కావాలంటే మీరే రీసెంట్‌గా వచ్చిన సినిమాల సంగతి చూడండి మీకే అర్థమవుతుంది. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) ‘యానిమ‌ల్‌’ (Animal) సినిమాలో సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), ప్రభాస్‌ (Prabhas) – పృథ్వీ రాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ‘స‌లార్‌’ (Salaar) సినిమాలో ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), ఉన్ని ముకుందన్‌ (Unni Mukundan) ‘మార్కో’ (Marco) సినిమాలో హనీఫ్‌ అడేనీ (Haneef Adeni), నాని (Nani) ‘హిట్ 3’ ′(HIT 3) సినిమాలో శైలేష్‌ కొలను  (Sailesh Kolanu) చేసింది ఇదే.

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)- గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) ‘కింగ్‌డమ్‌’ (Kingdom)  చూసినా.. రాబోయే నాని (Nani) – శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) ‘ప్యారడైజ్‌’ (The Paradise) , చిరంజీవి (Chiranjeevi)  – శ్రీకాంత్‌ ఓదెల సినిమా, ప్రభాస్ – సందీప్‌ రెడ్డి వంగా ‘స్పిరిట్‌’ (Spirit), ఎన్టీఆర్‌ (Jr NTR) – ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ‘డ్రాగన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) ఇలానే ఉంటాయని టాక్‌. ఇక ‘యానిమల్‌ పార్క్‌’ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా సినిమాలు ఊచకోతను కొనసాగిస్తూ ఉంటే.. ప్రేక్షకులకు ముఖం మెత్తేసి, ఇలాంటి సినిమాల మీద చిరాకు పడతారు. కాబట్టి ఇదంతా జరిగేలోపు సెన్సార్‌ బోర్డు సభ్యులు సన్నివేశాలు నరకాల్సిన అవసరం ఉంది. దర్శనిర్మాతలు, హీరోలు కూడా ఈ సీన్ల మీద ఫాంటసీ (ఉంటే) తగ్గించుకోవాల్సి ఉంది.

అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus