బాహుబలి కంక్లూజన్ తెలుగు రాష్ట్రాల్లో కంటే హిందీ రాష్ట్రాల్లోనే అత్యధిక కలక్షన్స్ సాధించింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ని ప్రతి ఒక్కరూ అభినందించారు. భారతీయులు ప్రతి ఒక్కరూ గర్వించేలా గొప్ప సినిమాని రూపొందించారని ప్రశంసించారు. ఇప్పుడు మాత్రం రాజమౌళిని విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే బాహుబలి 2 విడుదలైన తర్వాత బాలీవుడ్ లో ‘ట్యూబ్‌లైట్’, ‘జబ్ హారీ మెట్ సెజల్’, ‘రాబ్తా’, ‘జగ్గా జసూస్’, ‘హాఫ్ గాల్ ఫ్రెండ్’, ‘మున్నా మైఖేల్’, ‘సర్కార్ 3’ ఇలాంటి ఎన్నో భారీ సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. అయితే ఒకటి కూడా హిట్ కాలేకపోయాయి.
కారణం ఆ సినిమాలను బాగా తెరకెక్కించలేక పోవడం కాదంట, బాహుబలి కంక్లూజన్ ని బాగా తీయడమేనని అక్కడి బాలీవుడ్ మీడియాలు కథనాలను ప్రచురించాయి. బాహుబలిలో ఉన్న విధంగా స్పెషల్ ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలు ఇప్పుడు వచ్చిన సినిమాల్లో లేకపోవడంతో ప్రేక్షకులు కొత్త అనుభూతి చెందడం లేదని, ప్రతి సినిమాని బాహుబలితో పోల్చుకోవడం వల్ల ఫెయిల్ అవుతున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే బాలీవుడ్ డైరక్టర్లు, హీరోలు రాజమౌళిపై గుర్రుగా ఉన్నారంట. మంచి పని చేసిన విమర్శలు వస్తుంటాయని అంటుంటారు.. అది ఇదేనేమో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.