తాజాగా భారత్ – పాక్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. పూల్వమా దాడి లో 42 మందికి పైగా సి.ఆర్.పి.ఎఫ్ సైనికులు చనిపోవడం… ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్ ను మొదలుపెట్టడం సంచలనం సృష్టించింది. తాజాగా భారత భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు చొచ్చుకురావటం.. వాటిని తరిమే క్రమంలో పొరపాటున భారత యుద్ధ విమానం ఎల్.వో.సీ క్రాస్ చేయటం.. పాక్ దాన్ని కూల్చేయడం జరిగింది. అయితే.. అలా కూలిపోయిన ఆ యుద్ధ విమానం నుండీ దురదృష్ట వశాత్తు .. పాక్ సైన్యానికి చిక్కిపోయాడు భారత యుద్ధ పైలెట్ అభినందన్.
అయితే తాజాగా పాక్ ఆర్మీ అదుపులో ఉన్న అభినందన్ ను విడుదల చేస్తున్నట్టు పాక్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ చర్యను శాంతి చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందనడానికి తొలి మెట్టుగా ఇమ్రాన్ అభివర్ణించారు. ఇక ఈ నేపథ్యంలో ఈ అంశం పై చిత్రాల్ని తెరకెక్కించాలని బాలీవుడ్ ప్రొడ్యూసర్లు పోటీ పడుతున్నారట. ఇప్పటికే ‘పుల్వామా ది డెడ్లీ అటాక్’ ‘అభినందన్’ ‘బాలాకోట్’ ‘సర్జికల్ స్ట్రైక్ 2.0’ వంటి టైటిల్ కోసం అక్కడ దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారట. ఇక ఈ మద్యే ‘యూరి ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రం విడుదలయ్యి ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకోసమే ఇలా వారు ఆరాటపడుతున్నట్టు స్పష్టమవుతుంది.