Balayya Babu: అనిల్‌ రావిపూడి సినిమాలో బాలీవుడ్‌ భామ ఫిక్సా?

సినిమా తర్వాత సినిమా.. ఇదీ నందమూరి బాలకృష్ణ స్టయిల్‌. ‘వీర సింహా రెడ్డి’ సినిమా షూటింగ్‌ చివరిదశకొచ్చింది. దీంతో నెక్స్ట్‌ సినిమా పనుల్లోకి ఆయన దిగడానికి సిద్ధమవుతున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తర్వాతి సినిమా అనే విషయం ఇప్పటికే అనౌన్స్‌ చేసేశారు. ఆ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేస్తున్నారట అనిల్‌ టీమ్‌. ఈ క్రమంలో హీరోయిన్‌ ఎంపిక విషయంలో ఓ క్లారిటీకి వచ్చారు అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాలీవుడ్‌ భామను తీసుకోవాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు. తాజాగా దాని కోసం ‘డబుల్‌ XL’ భామను ఎంచుకున్నారట.

బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ఈ 108వ సినిమాలో బాలీవుడ్‌ ‘డబుల్‌ XL’ భామ సోనాక్షీ సిన్హాను తీసుకోవాలని చూస్తున్నారట. ఇటీవల ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’తో బాక్సాఫీసు దగ్గరకు వచ్చి ఆశించిన విజయం అందులోక చతికిలపడింది సోనాక్షీ. ఇప్పుడు ఆమెను బాలకృష్ణ కొత్త సినిమాలో కథానాయికగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. నిజానికి ఈ పాత్ర కోసం తొలుత త్రిషను హీరోయిన్ గా అనుకున్నారట. అయితే సినిమాను హిందీలోనూ విడుదల చేయాలని అనుకుంటుండటంతో హిందీ నాయిక అయితే బెటర్‌ అనుకుంటున్నారట.

సోనాక్షీ ఇప్పటికే దక్షిణాదిలో ఓ సినిమాలో నటించింది. రజనీకాంత్ ‘లింగా’ సినిమాలో నటించి మెప్పించింది సోనాక్షీ. ఇప్పుడు బాలయ్యతో నటించడానికి ఓకే చెబుతుందేమో చూడాలి. నిజానికి నవంబర్‌లో సినిమాను మొదలుపెట్టాలనుకున్నారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత షూటింగ్‌ ఉండొచ్చు అంటున్నారు. ఇకీ సినిమా కథ ప్రకారం బాలయ్యకి కూతురు ఉంటుంది. ఆ పాత్రలో యువ హీరోయిన్ శ్రీలీల కనిపించబోతుంది. మరో హీరోయిన్ అంజలికి ఈ సినిమాలో విలన్ రోల్ దక్కిందట.

ఈ సినిమా గురించి దర్శకుడు అనిల్ రావిపూడి ఆ మధ్య కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పటివరకు బాలయ్యను ఎవరూ చూపించని కోణంలో ఈ సినిమాలో చూపిస్తానని చెప్పారు. ఈ సినిమాతో కొత్తగా ప్రయత్నం చేస్తున్నానని అని కూడా అన్నారు. అయితే బాలయ్య ఇమేజ్‌, ఫ్యాన్స్‌ ఆలోచనలు దృష్టిలో పెట్టుకునే కథను సిద్ధం చేశాను అని కూడా అన్నారు. మామూలుగా అనిల్‌ రావిపూడి కామెడీకి పెట్టింది పేరు. మరి ఈ సినిమాలో ఆ పేరు ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus