అలవైకుంఠపురంలో మూవీ బన్నీ ఇమేజ్ భారీగా పెంచేసింది. ఆ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బన్నీ, బాలీవుడ్ ని కూడా ఇంప్రెస్ చేశారు. బాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రం గురించి కామెంట్ చేయడంతో పాటు అల్లు అర్జున్ అమేజింగ్ అని కితాబు ఇచ్చారు. అల వైకుంఠపురంలో సాంగ్స్ బాలీవుడ్ ని కూడా ఫిదా చేయడం విశేషం. ఆ మూవీ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా బరిలోకి దిగిపోయారు.
దర్శకుడు సుకుమార్ తో చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప మూవీ పాన్ ఇండియా చిత్రంగా పలు భాషలలో విడుదల చేయనున్నారు. దీని కోసం బడ్జెట్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించనున్నారట. అంతా బాగానే ఉంది కానీ, హీరోయిన్ విషయంలోనే కొంచెం తేడా కొడుతుంది. పుష్ప మూవీ హీరోయిన్ గా రశ్మిక మందానను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సౌత్ లో మంచి క్రేజ్ ఉండడంతో పాటు లక్కీ లేడీ అనే బ్రాండ్ నేమ్ నేపథ్యంలో మేకర్స్ ఆమెను ప్రిఫర్ చేశారు.
మరి హిందీలో మూవీకి హైప్ రావాలంటే అక్కడి హీరోయిన్ ఉంటేనే జరుగుతుంది. బన్నీ కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు అంతగా పరిచయం లేరు. దీనితో పుష్ప మూవీ హీరోయిన్ గా ఓ బాలీవుడ్ భామను తీసుకుంటే బాగుండేది అనే ఆలోచన అందరిలో ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!