Bigg Boss Telugu 5: బిగ్ బాస్ 5 ఫినాలేకు చీఫ్ గెస్టులు ఎవరో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొత్తానికి వంద రోజులు ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని ఫైనల్ వారానికి చేరింది.. డిసెంబర్ 18వ తేదీన ఫైనల్ కోసం ఏర్పాట్లు కూడా స్టార్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ లలో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న కథనాల ప్రకారం సన్నీ సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ గా నిలుస్తారు అని టాక్ గట్టిగానే వస్తోంది.

అంతేకాకుండా పబ్లిక్ పోల్స్ లలో కూడా ఎక్కువగా సన్నికి చాలామంది ఓటు వేస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫైనల్ ఎపిసోడ్ కు ప్రత్యేక అతిథులుగా ఎవరెవరు రాబోతున్నారు అనే విషయంపై కూడా కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈసారి కేవలం టాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కూడా ప్రత్యేక అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. మొదట రామ్ చరణ్ RRR సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆలియా భట్ తో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది వరకే ఈ విషయంలో నిర్వాహకులు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.మరోవైపు 83 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రణవీర్ సింగ్ దీపికా పదుకునే కూడా బిగ్ బాస్ తెలుగు స్టేజ్ పై కనిపించబోతున్నట్లు సమాచారం. వారు ప్రత్యేకంగా కంటెస్టెంట్స్ తో మాట్లాడటమే కాకుండా స్పెషల్ అట్రాక్షన్ గా సినిమాలను ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరికొంత మంది సీనియర్ హీరోయిన్స్ కూడా స్పెషల్ డాన్సులతో ఆకట్టుకుంటారని టాక్ అయితే వస్తుంది.

ఇక ఈసారి ఫైనల్ కంటెస్టెంట్ కు 50 లక్షల ప్రైజ్ మనీ తో పాటు ప్రత్యేకంగా ఊఆ ఖరీదైన ఫ్లాట్ ను కూడా గెలుచుకునే అవకాశం ఉంటుందట. అయితే ఈసారి అందరి ఫోకస్ కూడా VJ సన్నీ పైనే ఎక్కువగా ఉంది. అతను తప్పకుండా గెలుస్తాడు అని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus