అవును, ఆ స్టార్ జంట (Star Couple) మరోసారి కలిసి బయట కనబడి అన్ని అనుమానాలను పటాపంచలు చేసారు. ఎవరా స్టార్ కపుల్? ఏంటా కథ అనుకుంటున్నారా? అయితే వెంటనే విషయంలోకి వెళ్ళిపోదాం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) , తన భర్త అభిషేక్ బచ్చన్ తో (Abhishek Bachchan) విడాకులు తీసుకోబోతుందంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నటి నిమ్రిత్‌కౌర్‌తో అభిషేక్ ఎఫైర్ కారణంగా ఐశ్వర్యతో విడిపోతున్నట్టు గుసగుసలు వినిపించాయి. దానికి తోడు కుమార్తె ఆరాధ్య బర్త్ డే వేడుకలకు అభిషేక్ హాజరు కాకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది.
Star Couple
అయితే ఐశ్వర్య కానీ, అభిషేక్ కానీ ఎప్పుడూ బహిరంగంగా ఈ గాసిప్స్ పై స్పందించింది లేదు. అయితే ఇటీవల న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న బచ్చన్ కుటుంబం తిరిగి ముంబై చేరుకుంది. ఈ క్రమంలో… అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, కుమార్తె ఆరాధ్య ముంబై ఎయిర్ పోర్ట్..లో కలిసి కనిపించడం విశేషం. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అందులో వారు నవ్వుతూ రిలాక్స్‌గా ఉన్నట్టు కనిపించరు.
ఈ క్రమంలో అభిషేక్ స్వయంగా ఐశ్వర్య మరియు ఆరాధ్య లోపలికి రావడానికి కారు డోర్ తెరిచి మరీ పట్టుకోవడం కూడా జరిగింది. ఇక ఈ ఫోటోల్లో అభిషేక్ గ్రే హుడీ మరియు నలుపు ప్యాంట్‌లో, ఐశ్వర్య సాధారణ నలుపు రంగు స్వెట్‌షర్ట్ మరియు జెగ్గింగ్‌లో కనబడగా, ఆరాధ్య నీలిరంగు స్వెట్‌ర్లో కనబడ్డారు. సో ఈ ఫోటోలతో వీరి ఫ్యాన్స్ హ్యాపీ. ఎందుకంటే ‘వారు విడిపోనున్నారు’ అంటూ వస్తున్న వార్తలకి ఇవి చెక్ పెట్టినట్లు అయ్యింది.