‘మీటూ’ టైం నుండి నటీమణులు తాము ఎదుర్కొన్న Laiగిక దాడుల గురించి ఓపెన్ గా చెప్పడం మొదలుపెట్టారు. తాజాగా బాలీవుడ్ నటి ఉపాసన సింగ్ (Upasana) కూడా ఓ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. ‘డర్’ ‘లోఫర్’ (Loafer) ‘భీష్మ’ (Bheeshma) ‘హంగామా’ ‘బాదల్’ ‘హల్ చల్’ ‘బబ్లీ బౌన్సర్’ వంటి సినిమాల ద్వారా ఈమె పాపులర్ అయ్యింది. ఇటీవల ఈమె పాల్గొన్న ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది.
Upasana:
ఆమె మాట్లాడుతూ.. “సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తలో నేను అనేక సమస్యలు ఫేస్ చేశాను. ముఖ్యంగా ఓ దర్శకుడి వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. సౌత్ కి చెందిన ఓ దర్శకుడు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ (Anil Kapoor) తో ఓ సినిమా చేయాలనుకున్నాడు. హీరోయిన్ గా నన్ను ఎంపిక చేసుకున్నాడు.అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. అయితే అతను ప్రతిసారి మీటింగులకి పిలిచేవాడు. నేను మా అమ్మ, చెల్లిని కూడా వెంటేసుకుని వెళ్లేదాన్ని.
‘ప్రతిసారి వాళ్ళు ఎందుకు?’ అని ఒకసారి నన్ను అడిగాడు. తర్వాత ఒకసారి అర్ధరాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసి హోటల్ కి రమ్మన్నాడు. దేనికి అని నేను అడిగితే.. ‘సిట్టింగ్ కోసం’ అని అన్నాడు. దీంతో నేను ‘నా దగ్గర కారు లేదు, రేపు ఉదయం ఆఫీస్ కు వస్తాను’ అని చెప్పాను. అందుకు అతను నీకు సిట్టింగ్ అంటే మీనింగ్ తెలీదా? అని అడిగాడు? తర్వాత దాని గురించి తెలుసుకుని నేను షాక్ అయ్యాను.
తర్వాత ఉదయం పూట అతని ఆఫీస్ కి వెళ్లి…అతన్ని అందరి ముందు తిట్టి పారేశాను. అటు తర్వాత అతను నన్ను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పించేశాడు. అయినప్పటికీ ఇలాంటి సమస్యలు వచ్చినా ఇండస్ట్రీ వదలకూడదు అని నేను నిశ్చయించుకున్నాను. అందుకు మా అమ్మ కూడా నాకు సపోర్ట్ చేసింది” అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన సింగ్.