బాలీవుడ్‌కి వెళ్లి అక్కడి సినిమాల్లో నటించిన సౌత్ సినిమాల హీరోలు అని లిస్ట్ రాస్తే రీసెంట్ హీరోల్లో తొలి స్థానాల్లో కనిపించే పేరు ధనుష్. తమిళంలో స్టార్ స్టేటస్ ఉన్న సమయంలోనే బాలీవుడ్ వెళ్లి సినిమాలు చేస్తున్నారాయన. అయితే ఆయనకు బాలీవుడ్ ఎదురైన అనుభవాల గురించి ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఇటీవల ప్రస్తావించారు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాదు చాలా రోజులుగా బాలీవుడ్ సినిమా జనాల మీద ఉన్న అపవాదు నిజం అనేలా ఉన్నాయి ఆ మాటలు.
పాన్ ఇండియా ట్రెండ్ ఇండియాలోకి వచ్చే ముందే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ధనుష్. 2013లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ‘రాన్‌జ్నా’ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే ధనుష్‌కు తమిళంలో స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ హిందీ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. దాంతో బాలీవుడ్‌లో ధనుష్ అంతగా చేరువకాలేకపోయాడు అని చెప్పాలి. అంతేకాదు ధనుష్‌ని తన సినిమాలో నటింపజేసిన తన నిర్ణయాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదని, వారి నుంచి వ్యతిరేకత ఎదురైందని పేర్కొన్నారు ఆనంద్.
నార్త్ ఇండియా హీరోలకు ఉండాలి అని అక్కడి అభిమానులు కోరుకునే క్వాలీటీలు ఏవీ ధనుష్‌కి లేకపోవడమే దానికి కారణం అని చెప్పారు ఆనంద్ ఎల్ రాయ్. నార్త్ సినిమాల హీరో అంటే ఒక ఇమేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. 6 అడుగుల పొడవున్న ఫెయిర్ బాయ్ అంటేనే హీరో అని నార్త్‌లో అనుకునేవారు. అలాంటి సమయంలో ధనుష్‌ని (Dhanush) ఇక్కడి జనాలు విచిత్రంగా చూశారు.
అయితే అతని సినిమాలు చూసినప్పుడు అతన్ని మించిన నటుడు ఎవరూ లేరు అని చెప్పుకొచ్చారు ఆనంద్. ‘రాన్‌జ్నా’ తర్వాత ‘అతరంగిరే’ అనే సినిమా చేశారు ఆనంద్ ఎల్ రాయ్ – ధనుష్. ఇప్పుడు మరోసారి ఇదే కాంబినేషన్లో ‘తేరే ఇష్క్ మే’ అనే సినిమా రాబోతోంది. ‘రాన్‌జ్నా’ సినిమాకు మూవీకి ఇది సీక్వెల్.