Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?
- January 31, 2026 / 03:04 PM ISTByFilmy Focus Desk
‘వారణాసి’ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు అని చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. ఎందుకంటే రాజమౌళి సినిమాలు ఇప్పుడు అన్నీ అలానే ఉంటున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్‌ను కేవలం తెలుగు సినిమానో లేక భారతీయ సినిమా రిలీజ్‌లా ఉండకుండా ఓ ఇంటర్నేషనల్ సినిమా ఎలా విడుదవుతుందో అలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఎస్.ఎస్.రాజమౌళి. అదే ప్లానింగ్‌లోనే ఇప్పుడు సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ మాత్రం సాదాసీదాగా తేల్చేశారు.
Varanasi
కొన్ని రోజుల ముందు వారణాసిలో కొన్ని పోస్టర్లను పెట్టారు. ‘ఏప్రిల్ 7, 2027’ రిలీజ్ అని మాత్రమే రాశారు. అయితే ఇది ‘వారణాసి’ సినిమా గురించే అందరూ ఊహించేశారు. అనుకున్నట్లుగానే సినిమా రిలీజ్ డేట్ ఇదే అంటూ సాఫ్ట్‌గా ప్రకటించేశారు. ఎందుకింత నార్మల్ అనౌన్స్‌మెంట్ అనే డౌట్ చాలామందికి వస్తోంది. అందులోనూ రిలీజ్ డేట్‌ల మీద నిలబడే రకం కాదు రాజమౌళి. కాబట్టి ఏదో అలా కర్చీఫ్ వేయడానికి అలా సాఫ్ట్‌గా డేట్ చెప్పేశారా అనే డౌట్ ఉంది.

ఇక మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారని వస్తున్న వార్తలకు తగ్గట్టుగా ఓ కొత్త వాదన వినిపిస్తోంది. సినిమా పోస్టర్‌లో గ్లోబ్ ట్రాటర్ అనే హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు. ఆకాశం నుండి ఓ శకలం భూమిని తాకినట్లుగా ఏడు అంకె రూపంలో పోస్టర్ డిజైన్ చేశారు. దాని ప్రకారం రెండు భాగాలకు రెండు టైటిల్స్ లాక్ చేసినట్లు చెబుతున్నారు. ‘వారణాసి: గ్లోబ్ ట్రాటర్’ ఒకటైతే.. ‘వారణాసి: టైం ట్రాటర్’ రెండోది అని చెబుతున్నారు.
ఒక పార్ట్ హ్యాష్‌ట్యాగ్ చూసి రెండు పార్టులు, రెండు పేర్లు అని ఎలా ఫిక్స్ అవుతారు అనే డౌట్ రావొచ్చు. ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌లో టైటిల్ గ్లింప్స్‌లో గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్ అని రెండూ ఇచ్చారు. ఇప్పుడు పోస్టర్ మీద ఒకటే ఉండటంతో ఇది పార్ట్ 1 టైటిల్ అని ఓ అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంలో రాజమౌళి టీమే క్లారిటీ ఇవ్వాలి.













